కోవిడ్ 19 మహమ్మారి ముంచెత్తున్న వేళ, రెండు డోసులూ కలుపుకుని ఒక్కో వ్యక్తీ 2,400 రూపాయలు ఖర్చు చేయలేడా.? (Covid 19 Vaccine Prices Hiccups In India) ఈ ప్రశ్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ విషయంలో వినిపిస్తోన్న వాదన. అదే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే రెండు డోసులకి చెల్లించాల్సిన ధర 1,200 రూపాయలు మాత్రమే.
కొత్త సినిమా టిక్కెట్‌ని బ్లాక్‌లో కొనేయడానికి వెయ్యి రూపాయలైనా వెచ్చించేస్తాం. అలాంటిది, మన ప్రాణాలు కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కోసం పైన చెప్పుకున్న ధర చెల్లించలేమా.? ఇక్కడ ధర చెల్లించడం, చెల్లించకపోవడం అన్నది సమస్య కాదు.
Also Read: Corona Virus Covid 19: మనిషి వర్సెస్ మానవ మృగం
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే, రెండు డోసుల వ్యాక్సిన్ కేవలం 300 రూపాయలు మాత్రమే. అది కోవాగ్జిన్ (Covaxin) అయినా, కోవిషీల్డ్ (Covisheild) అయినా ఒకటే ధర. అదే రాష్ట్ర ప్రభుత్వాలు కొనాల్సి వస్తే ఇంకో రేటు. కోవాగ్జిన్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు డోసులకుగాను 1200 ఖర్చవుతుంది. కోవిషీల్డ్ అయితే రెండు డోసుల ధర 800 మాత్రమే.
మనం మొదట చెప్పుకున్న 2,400 అలాగే 1,200 ధర సామాన్యులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా వేయించుకోవడానికి అయ్యే ఖర్చు. నిజానికి, కరోనా పాండమిక్ (Covid 19 Corona Virus Pandemic) అనేది దేశం గతంలో ఎన్నడూ చూడని వైపరీత్యం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రమే బాధ్యత తీసుకుని, అందరికీ వ్యాక్సినేషన్ అందించాలి. ఆ దిశగానే వ్యాక్సిన్ తయారీ సంస్థలకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది.
Also Read: సెకెండ్ వేవ్: నో మాస్క్! కరోనా వైరస్‌కి వెల్‌కమ్.!
కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల నేపథ్యంలో, కేంద్రానికి వ్యాక్సిన్ తయారీ సంస్థలు తక్కువ ధరకే వ్యాక్సిన్ అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలకు కాస్త అదనపు వాత పెడుతూ, ప్రైవేటు దగ్గరకు వచ్చేసరికి పూర్తి వాత పెట్టేస్తున్నాయన్నమాట. కేంద్రం (India Fights Corona Virus Covid 19) అభ్యర్థన మేరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్, రాష్ట్రాలకు గతంలో ప్రకటించినట్లు 400 కాకుండా, 300 రూపాయలుగా (ఒక్కో డోసు ధర) నిర్ధారించింది.
వ్యాక్సిన్ ధరలో ఈ తేడా, సామాన్యుడిని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఎవరు ఇక్కడ మతలబు చేస్తున్నారో సామాన్యుడికి అర్థం కాని పరిస్థితి. అయినా, అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేడిప్పుడు సామాన్యుడు. ప్రాణం వుంటుందా.? పోతుందా.? అన్నదే సామాన్యుడి భయం. ఈ గందరగోళం నడుమ వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయి.
రేటు సంగతి పక్కన పెడితే, 130 కోట్ల మంది భారతీయులకు అవసరమయ్యే స్థాయిలో కరోనా వ్యాక్సిన్ (Covid 19 Vaccine Prices Hiccups In India) ఉత్పత్తి ఎంత కాలంలో జరుగుతందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.