Covid India విన్నారా.? ఇది విన్నారా.? మళ్ళీ ప్రపంచాన్ని కోవిడ మహమ్మారి కమ్మేయనుందట.! ఈసారి ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ఏమో.!
నిజానికి కోవిడ్ కంటే కూడా పెద్దదైన ఇంకో వైరస్ వుంది. అదే మెడికల్ మాఫియా వైరస్.!
ప్రపంచంలోని ఇతర దేశాల సంగతి పక్కన పెడితే, మన దేశంలో మెడికల్ మాఫియా వైరస్ సృష్టించే మారణహోమం అంతా ఇంతా కాదు.
Covid India ఈ దోపిడీ.. కొనసాగనీ.!
సాధారణంగా కోవిడ్ చాలామందిలో పెద్దగా ప్రభావం చూపదు. కొంతమందిలో మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు.
కానీ, మెడికల్ మాఫియా దోపిడీ మాత్రం అందరికీ సమానమే. ఆక్సిజన్ సిలెండర్ల దాకా ఎందుకు.? సాధారణంగా దొరికే ఫేస్ మాస్కుల విషయంలోనూ దోపిడీనే.
కొన్ని ప్రత్యేకమైన ఇంజెక్షన్ల విషయంలో అయితే, ఈ దోపిడీ మరో లెవల్ అన్నట్టు సాగింది దందా.! ఆనాటి ఆ భయాల్ని గుర్తు చేసుకుంటే, ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.
వాళ్ళకి అది పెద్ద పండగ..
ఔను.! కోవిడ్ మళ్ళీ కొత్త రూపంలో దాడి చేయబోతోందట.. అన్న వార్తతో ఒక్కసారిగా మెడికల్ మాఫియా అప్రమత్తమయ్యింది. పండగ చేసుకుంటోంది.
Also Read: నయా వైరస్సూ.! సరికొత్త బెదిరింపుల్సూ.!
ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు సూచించినా, అంతిమంగా అది ప్రజల చేతుల్లోనే వుంటుంది. ఔను, వ్యక్తిగత పరిశుభ్రదత.. జనంలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం.. ఇవీ జనం చేయాల్సినవి.
కొన్నిసార్లు కోట్లు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబడని పరిస్థితి వస్తుంది. మెడికల్ మాఫియా రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న ఆలోచనతో వుండాలి ప్రతి ఒక్కరూ.