Table of Contents
కరోనా పాండమిక్‌కి ముందు.. కరోనా పాండమిక్ తర్వాత.. (Covid Pandemic Cinema Theatres Gets Huge Shock From OTT) ఇలా చెప్పుకోవాలి ఇకపై సినిమా థియేటర్ల గురించి.
సినిమా థియేటర్లు (Movie Theatres In Andhra Pradesh And Telangana) నెలల తరబడి మూతపడ్తాయనీ, ప్రేక్షకులు అసలు థియేటర్లకు వెళ్ళలేని పరిస్థితి వస్తుందనిగానీ, ఎవరూ ఊహించలేదు. ఇలాంటి సమయంలోనే ఓటీటీ, సినీ ప్రేక్షకులకు పెద్ద ఊరటగా మారింది. వెండితెరకు ప్రత్యామ్నాయంగా మారింది ఇంట్లోని డిజిటల్ స్క్రీన్.
Also Read: సినిమా రివ్యూ.. ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం.. ఓటీటీ వైపు చూసే ప్రసక్తే లేదు..’ అని చెప్పిన చాలామంది దర్శక నిర్మాతలు, నటీనటులు.. చివరికి ఓటీటీని నమ్ముకోక తప్పలేదు, తమ సినిమాల్ని ఓటీటీకి అమ్ముకోక తప్పలేదు. ఒకప్పుడు వెండితెరకు బుల్లితెర షాకిచ్చింది.. అయినాగానీ, వెండితెర నిలదొక్కుకుంది. తనకు పోటీ ఇంకెవరూ లేరని నిరూపించుకుంది.
సాంకేతిక విప్లవమిది..
కానీ, ఇప్పుడు సీన్ మారింది. సాంకేతిక విప్లవం సినిమా అనుభూతిని థియేటర్ల కంటే ఇంట్లో గొప్పగా అందించేస్తోంది. సకుటుంబ సపరివార సమేతంగా ఓ మినీ థియేటర్ తరహాలో ఏర్పాట్లు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. దాంతో, వెండితెరపై సినిమా చూసిన అనుభూతి ఇంట్లోనే కనిపిస్తోంది.
ఓటీటీ వుండగా.. సినిమా థియేటర్ ఎందుకు దండగ.? (OTT Is Best Cinema Theatres Are Waste) అన్న అభిప్రాయానికొచ్చేశారు చాలామంది ప్రేక్షకులు. అలాగని, సినిమా థియేటర్లకు ముందు ముందు వెళ్ళడం మానేస్తారా.? అంటే, మానేయకపోవచ్చగానీ, తగ్గించేస్తారన్నది నిర్వివాదాంశం.
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా..
కేవలం చిన్న సినిమాలకే ఓటీటీ బెటర్.. అన్న భావన మొదట్లో వుండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద సినిమాలకూ వేరే గత్యంతరం కన్పించడంలేదు. పే పర్ వ్యూ.. ప్రాతిపదికన చాలా వేదికలున్నాయి. వాటి ద్వారా సినిమాలు విడుదల చేసుకోవడమే ఉత్తమం ప్రస్తుతతమున్న పరిస్థితుల్లో.
Also Read: సినిమా రివ్యూ.. ఉప్పెన
స్టార్ హీరోలైనా, చిన్న హీరోలైనా.. అందరికీ ఇప్పుడు వెండితెర కంటే ఓటీటీ చాలా పెద్దదిగా కనిపిస్తోందనడం అతిశయోక్తి కాకపోవచ్చు. నిజానికి, ఓటీటీ.. సినీ పరిశ్రమని కాస్త ఆదుకుందనే చెప్పాలి. ఓటీటీ లేకపోతే ఏంటి పరిస్థితి.? (No OTT No Cinema Industry) దయనీయం.. అత్యంత దయనీయంగా మారిపోయేది సినీ పరిశ్రమ పరిస్థితి.
ముందు ముందు థియేటర్లు వుంటాయా.?
మల్టీప్లెక్సులు సైతం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. షాపింగ్ మాల్స్‌కి అనుబంధంగా వుంటాయి కాబట్టి, వాటికి కొంత ఊరట అంతే. సింగిల్ స్క్రీన్స్ (Movie Theatres Are Facing Huge Shock From OTT) మాత్రం.. పెను సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి.
Also Read: సినిమా రివ్యూ.. ‘వి’
ప్రభుత్వాలు ఆదుకున్నాగానీ.. సినిమా థియేటర్లు కోలుకోవడం దాదాపు గగనమే. ఎందుకంటే, ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతోంది.. కాదు కాదు, దాదాపుగా మారిపోయింది. మూడో వేవ్ అంటూ వస్తే, సినిమా థియేటర్ల గురించి (Covid Pandemic Cinema Theatres Gets Huge Shock From OTT) జనం పూర్తిగా మర్చిపోవడమే.