CPI Ramakrishna Dirty Talk.. రాజకీయ నాయకులన్నాక నోటికి అదుపు వుండకూడదేమో.! అన్నం కాకుండా, అశుద్ధమే తినాలేమో.! ఇలా తయారయ్యారు కొందరు రాజకీయ నాయకులు.
వామపక్షాలంటే, ప్రజాదరణ లేకపోయినా.. కాస్తో కూస్తో కొంత గౌరవ భావం అయితే వుంటుంది.! దాన్ని స్వయానా చెడగొట్టుకుంటున్నది ఆ వామపక్షాలకు చెందిన నాయకులే.
చికెన్ నారాయణ.. అదే సీపీఐ నాారాయణ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కొత్తగా, సీపీఐ రామకృష్ణ కూడా తయారయ్యారు.. అదే కోవలో.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవా, ఇటీవల తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే.
అన్నా లెజినెవాపై వివాదాస్పద వ్యాఖ్యలెందుకు.?
పవన్ కళ్యాణ్ – అన్నా లెజినెవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్, ఇటీవల సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురై, ప్రాణాలతో బయటపడ్డాడు.
తీవ్ర గాయాల నుంచి తన కుమారుడు కోలుకోవడంతో, మొక్కు తీర్చుకున్నారు అన్నా లెజినెవా, వెంకటేశ్వర స్వామికి తలనీలాల సమర్పణతో.

ఏ తల్లి అయినా, తన బిడ్డకి కష్టమొస్తే, ముక్కోటి దేవతలకు మొక్కుకుంటుంది.. ఆ కష్టం నుంచి తన బిడ్డను క్షేమంగా బయట పడేయమని కోరుతూ.
అన్నా లెజినెవా కూడా అంతే.! క్రిస్టియన్ అయినప్పటికీ, హిందూ సంప్రదాయాల్ని గౌరవించే అన్నా లెజినెవా, తన బిడ్డ కష్టంలో వున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు, మొక్కు చెల్లించుకున్నారు.
CPI Ramakrishna Dirty Talk..అశుద్ధ భక్షక రాజకీయం..
‘పవన్ కళ్యాణ్, తన భార్యకి గుండు కొట్టించాడు.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్..’ అంటూ సీపీఐ రామకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాలనుకుంటే, ఇంకేదన్నా విషయమ్మీద విమర్శలు చేసుకోవచ్చు. అంతేగానీ, ఇదా పద్ధతి.?
Also Read: Vaishnavi Chaitanya: ‘బేబీ’.. బూతులు తగ్గించుకో బాగుపడ్తావ్.!
కడుపుకు అన్నం తిని వుంటే, సీపీఐ రామకృష్ణ నోట ఇలాంటి మాటలు వచ్చి వుండేవి కావు. అశుద్ధ భక్షకులైన రాజకీయ నాయకులే, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయగలగుతారు.
అయినా, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఆచరిస్తే, ఆ పవన్ కళ్యాణ్ సతీమణి, తన భర్త అడుగుజాడల్లో సనాతన ధర్మాన్ని అనుసరిస్తే.. సీపీఐ రామకృష్ణకి వచ్చిన నష్టమేంటి.?