Dangerous Chicken Biriyani బిర్యానీ.. అనగానే, నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది కొంతమందికి. వారి జిహ్యచాపల్యం అలాంటిది మరి.!
పైగా, హైద్రాబాదీ బిర్యానీ అంటే.. ఆ కిక్కే వేరప్పా.! బిర్యానీని ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఎవరూ వుండరు. నాన్‌వెజ్‌కి రారాజుగా మారిపోయిందిప్పుడు బిర్యానీ.!
నాన్ వెజ్ బిర్యానీల్లో మటన్, ప్రాన్స్.. ఇలా ఎన్నో రకాలున్నాగానీ, చికెన్ బిర్యానీకి వున్న క్రేజ్ మాత్రం వేరే లెవల్.!
Dangerous Chicken Biriyani.. తింటున్నది చికెనేనా.?
అంత క్రేజ్ వున్న చికెన్ బిర్యానీలో, అసలు చికెన్ వుంటోందా.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు. ఫుడ్ సేఫ్టీ విభాగం ఎప్పటికప్పుడు, తనిఖీలు నిర్వహిస్తూనే వుంది.
ఆయా రెస్టారెంట్లలో కుళ్ళిన మాంసాన్ని నిల్వ చేసి వుంచడాన్ని అధికారులు గుర్తిస్తున్నారు.. సదరు రెస్టారెంట్లను మూసివేయిస్తున్నారు కూడా.
మరి, రోడ్ల పక్కన పెద్ద పెద్ద వంట పాత్రల్లో విక్రయిస్తున్న ‘తక్కువ ధర’ చికెన్ బిర్యానీ సంగతేంటి.? టేస్ట్ అదరహో.. అంటూ, ఫుడ్ బ్లాగర్స్ వీటి గురించి భలే చెబుతున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల యుగం కదా.. వీళ్ళ పుణ్యమా అని, ఖరీదైన కార్లలో వచ్చి మరీ, రోడ్ల మీద చిన్న చిన్న ‘గొడుగుల’ కింద విక్రయిస్తోన్న బిర్యానీని లాగించేస్తున్నారు ‘పెద్దోళ్ళు’ కూడా.
అయితే, ఏం తింటున్నామన్నది మాత్రం ఎవరికీ పట్టడంలేదు. కాకి బిర్యానీ అంటాడు ఒకడు.. ఇంకేదో బిర్యానీ అంటాడు మరొకడు.. ఇలా రోజుకో కొత్త ఆరోపణ తెరపైకిస్తోంది.
చికెన్ కంటే, మటన్ కల్తీ ఇంకా తేలిక కావడంతో, అది మరీ దారుణంగా తయారైంది. ఎంతలా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా, కల్తీ మాత్రం ఆగడంలేదు.
చికెన్, మటన్.. నాణ్యత సంగతి పక్కన పెడితే, బిర్యానీ తయారీలో వినియోగించే నూనె కూడా కల్తీనే. జంతువుల కొవ్వుతో తయారైన నూనెల్ని ఎక్కువగా వాడేస్తున్నారట బిర్యానీ తయారీ కోసం.
జిహ్వచాపల్యం సరే.. తినేది నాణ్యమైనదేనా.? అని ఓ సారి క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. ఇదంతా ఎందుకు, ఇంట్లోనే పద్ధతిగా బిర్యానీ తయారు చేసుకుంటామంటారా.. ఇదే కరెక్టు.!