Das Ka Dhamki FDFS ఇంతకీ, విశ్వక్ సేన్ ఎవరికి ధమ్కీ ఇచ్చాడు.? చూసే ప్రేక్షకులకా.! విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’.!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki) అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టినట్లే కనిపిస్తోంది.
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ విశ్వక్ సేన్..
ఈసారి పూర్తిగా నందమూరి దన్నుతో ‘దాస్ కా ధమ్కీ’ అంటూ హంగామా చేశాడు.!
ప్రీ రిలీజ్ సూపర్ బజ్ ఏర్పడింది ‘దాస్ కా ధమ్కీ’ మీద..
ఇక దర్శకత్వం మానెయ్.. అని విశ్వక్ సేన్‌కి యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎందుకు సూచించాడు.?
తొలిసారిగా గ్లామర్‌తో రెచ్చిపోయిన నివేదా పేతురాజ్ ఈ సినిమాకి ఎంత మేర ప్లస్ అయ్యింది.?
నటనతోపాటు దర్శకత్వం, నిర్మాణం.. అన్నీ తానే అయిన మాస్ కా దాస్, ‘దాస్ కా ధమ్కీ’ని ఎలా తెరకెక్కించాడు.?
ఇంతకీ ‘దాస్ కా ధమ్కీ’ ఓపెనింగ్స్ హంగామా ఏంటి.? ఫస్ట్ డే ఫస్ట్ రిపోర్ట్ ఎలా వుంది.?
Mudra369
ఓవర్సీస్‌లో కూడా ‘దాస్ కా ధమ్కీ’కి ప్రీమియర్స్ ద్వారా మంచి బిగినింగ్ లభించినట్లే రిపోర్టులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సందడి షురూ అయ్యింది.
Das Ka Dhamki FDFS సినిమా ఎలా వుంది.?
కాగా, ప్రీమియర్స్ టాక్ పరంగా చూసుకుంటే, ‘దాస్ కా ధమ్కీ’ ఫ్లాట్‌గా సాగింది. ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా సాగినా, రెండో సగం తేలిపోయిందని అంటున్నారు.
.జస్ట్ యావరేజ్.. బిలో యావరేజ్ టాక్ ప్రస్తుతానికైతే ప్రీమియర్స్ నుంచి వస్తోంది. ఒకేలా వుండే ఇద్దరి వ్యక్తులు.. ఈ ఇద్దరి మధ్యా కాన్‌ఫ్లిక్ట్.. ఇదీ ‘దాస్ కా ధమ్కీ’ కథ.
విశ్వక్ సేన్ నటుడిగా తాను చెయ్యగలిగినంతా చేశాడు. దర్శకత్వం పరంగా చూసుకుంటే మాత్రం జస్ట్ ఓకే.! నిర్మానం పరంగా ఫుల్ మార్క్స్.. అనే చర్చ నడుస్తోంది.
కొంప ముంచిన ట్విస్టులు..
కథలో ట్విస్టులు ఎక్కువైపోవడంతో గందరగోళం చోటు చేసుకుందన్నది పెద్ద కంప్లయింట్ సినిమా (Das Ka Dhamki) చూసినవాళ్ళ నుంచి.
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) బాగానే చేసిందట. రావు రమేష్ షరామామూలేనట. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది.
Also Read: మాస్ అమ్మ మొగుడు.! ఎన్టీయార్‌కే ధమ్కీ ఇచ్చినవ్.!
సినిమా ప్రమోషన్లు అదరగొట్టేసిన దరిమిలా, ఉగాది పండగ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోవచ్చు. వీకెండ్ వరకూ సినిమా నిలబడటమ్మీదనే సినిమా ఫలితం ఆధారపడి వుంటుంది.

అన్నట్టు, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి హాజరవడంతో, ఆ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఈ ‘దాస్ కా ధమ్కీ’ని ఓన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
