Dead Pixels Review.. వెబ్ సిరీస్ అంటేనే ఛండాలం.! అలాగని ఎందుకు అనుకోవాలి.? కొన్ని మంచి వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయ్ కదా.?
ఔను, అన్ని చోట్లా మంచీ చెడూ వున్నట్లే.. ఇక్కడ కూడా.! ఏది మంచి.? ఏది చెడు.? ఇది మళ్ళీ ఇంకో ప్రశ్న.!
ఇంతకీ, డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ఎలా వుందట.? వన్ వర్డ్.! చాలా చాలా ఛండాలంగా వుంది.! ఏం నచ్చి, ఈ కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్ తీయాలనుకున్నారో.!
Dead Pixels Review.. పిచ్చి బాగా ముదిరిపోయింది..
ఓ ఇంట్లో ముగ్గురుంటారు.. అందులో, ఇద్దరు ఆన్‌లైన్ గేమ్స్ అంటే పడి సచ్చిపోతారు.! వాళ్ళిద్దర్నీ వారించే పాత్ర ఇంకోటి.!
ఆ ఇద్దరు పిచ్చోళ్ళకి అదనంగా మరో పిచ్చోడుంటాడు. ఇంకో తింగరోడు కూడా.! అర్థమయ్యింది కదా, ‘డెడ్ పిక్సెల్స్’లో పాత్రలెలా వున్నాయో.

చూడటం మొదలెట్టాక.. కాస్సేపటికే మీకు మతిపోతుంది.! అలా పోకపోతే, మీరూ ఆ పిచ్చోళ్ళ జాబితాలో చేరిపోయినట్టే లెక్క.!
అసలు నిహారిక ఈ వెబ్ సిరీస్‌కి ఎలా ఓకే చెప్పిందబ్బా.? జస్ట్ కక్కుర్తి అంతే.. అనుకోవాలేమో.! లేదంటే, ఆ పిచ్చితనం ఆమెకైతే బాగా సూటవుతుందని అనుకున్నారో.!
అసహ్యం.. జుగుప్స.. అన్నీ..
బహుశా నిహారిక కూడా తన తింగరితనానికి, తన పిచ్చితనానికీ ఈ పాత్ర సూటవుతుందని అనుకుందేమో.. అని ఎవరైనా అనుకుంటే, అది మీ తప్పు కాదు.!
ఘోరం.. ఘోరాతిఘోరం.! ఔను, ‘డెడ్ పిక్సెల్స్’ చూడాల్సి వస్తే, అంతకన్నా శిక్ష ఇంకోటుండదు. ఏ పాత్ర ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవడికీ అర్థం కాదు.
ఆన్‌లైన్ గేమ్‌లో ఓ పాత్ర చనిపోతుంది.. నిజంగానే, ఆ పాత్రధారి చనిపోతాడు.! చనిపోయింది కేవలం పాత్ర మాత్రమేనా.? పాత్రధారి చనిపోయాడా.? అన్న సందేహం సినిమాలోని పాత్రలకు కలుగుతుంది.
More At: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
ఇలాంటి పిచ్చితనాలు చాలానే కనిపిస్తాయ్ ‘డెడ్ పిక్సెల్స్’లో. ఆన్‌లైన్ గేమ్‌లోని పాత్రలు పెళ్ళి చేసుకుంటాయ్.. లిప్ లాక్ పెట్టకుంటాయ్.!
అస్తమానూ, వాంతి వచ్చినట్లుగా ఇద్దరు ఆన్‌లైన్ పిచ్చోళ్ళు ప్రవర్తిస్తుంటారు.. వాళ్ళనలా చూసినప్పుడల్లా వీక్షకులకీ వాంతి రావడం ఖాయం.!
వద్దు బాబోయ్.! ఇక ఈ పిచ్చితనాన్ని వర్ణించడం నా వల్ల కాదు.! ఔను, చదివేవాళ్ళకీ వాంతులొచ్చేస్తాయ్.! బెటర్.. కీప్ డిస్టెన్స్ విత్ డెడ్ పిక్సెల్స్.!