Deer Eats Snake.. జింక అంటే శాఖాహారి.! కానీ, అది మాంసాహారిగా మారితే.! చాలా చాలా అరుదైన విషయమిది. దాదాపు అసాధ్యం అంటారు పశు వైద్యులు.!
అసలు విషయంలోకి వెళితే, నిజంగానే ఓ పాముని జింక కరకరా నమిలేసింది.! అంతలా ఆ పాము ఎందుకు జింకకు ‘రుచికరంగా’ అనిపించిందబ్బా.?
ఏమో.! ఎవరికీ తెలీదు. కానీ, ఓ పాముని జింక నమిలేస్తున్న దృశ్యం కెమెరాల్లో బందీ అయ్యింది.!
Deer Eats Snake.. జింక నోటికెలా చిక్కిందబ్బా.?
ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. జింక నోటికి చిక్కిన ఆ పాము విషపూరితమైనదా? కాదా.? అన్నది మాత్రం తేలలేదు.
ఒకవేళ విషపూరితమైన పామునే గనుక జింక తినేసినట్లయితే, జింకకు ప్రాణాపాయం తప్పదు.!
వాస్తవానికి, విష పూరితమైన పాములైతే, జంతువుల్ని, విషపు కాటుతో చంపేస్తాయ్ కూడా.! ఏనుగు లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా, కోబ్రా వంటి విష పూరిత పాములకు భయపడతాయ్.
ఎలా తినేయగలిగింది.?
అలాంటిది, ఓ చిన్న జింక.. ఎలా పాముని తినేయగలిగింది.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు.
గడ్డిని తినే క్రమంలో అనుకోకుండా, జింక నోటికి పాము చిక్కి వుంటుందనీ.. అది రుచికరంగా అనిపించడంతో జింక ఆ పాముని అలాగే తినేసి వుంటుందని అంచనా వేస్తున్నారు.

ఓ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read: Swetha Naagu.. అత్యంత విషపూరితమా.! అసలుందా.?
‘ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి..’ అంటూ ఆయన ఆ వీడియోకి ఓ కామెంట్‌ని జత చేశారు.
‘శాఖాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి..’ అని పేర్కొన్నారాయన.
అసలంటూ మనిషిని శాఖాహారిగా చెబుతారు కొందరు.! మన జీర్ణ వ్యవస్థ కావొచ్చు, పళ్ళ వ్యవస్థ కావొచ్చు.. ఇవేవీ మాంసాహారం తినడానికి అనువుగా వుండవట.
కానీ, ప్రపంచంలో మనిషి తనకు కనిపించిన అన్ని జీవ జాతుల్నీ తినేస్తాడు.! అలాంటప్పుడు, ఓ జింక.. పాముని తినేస్తే అందులో వింతేముంది.?