Devara Beauty Janhvi Kapoor.. అసలు ఆ స్టిల్స్ ఏంటి.? ఆ ఎడిటింగ్ ఏంటి.? ‘దేవర’ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ప్రతి స్టిల్, పోస్టర్ విషయంలోనూ ఇవే కామెంట్లు.!
ఒక్క పోస్టర్‌తో మొత్తం ఈక్వేషన్ మారిపోయింది.! మీరు పైన చూస్తున్నదే అది.! ఇది కదా మాక్కావాల్సింది.. అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు పండగ చేస్కుంటున్నారు.
చూస్తున్నారు కదా.. ఫొటోలకు మించి.. పాటలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత కుర్రకారు హృదయాలకు చిల్లలు పెట్టేస్తోంది.
తెలుగులో తొలి సినిమాతోనే.. అంతకు మించిన అందాల ప్రదర్శనకు జాన్వీ కపూర్ ‘సై’ అనేయడం.. ఒకింత ప్రత్యేకమే మరి.!
జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ ఆ రేంజ్‌లో వుంది మరి.! ఇకనేం, ‘అతిలోక సుందరి’ జాన్వీ కపూర్.. (Athiloka Sundari Janhvi Kapoor) అనేయొచ్చా.? అనేసుకోవచ్చేమో కూడా.!
Devara Beauty Janhvi Kapoor.. ఓవర్ డోస్ అవుతోందా.?
ఓ వైపు ఈ స్టిల్ చూసి పండగ చేసుకుంటూనే, ఇంకో వైపు, ‘జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ ఎక్కువైపోయిందేమో దేవరా..’ అంటూ కామెంట్లు పడుతున్నాయ్.

కంటెంట్‌లో క్వాలిటీ లేకనే, దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ఇలా గ్లామర్‌ని ఎంచుకున్నాడేమో.. అన్న అనుమానాలు షురూ అయ్యాయ్.
Also Read: Malavika Mohnan: ‘ఆ నాలుగ్గంటల కష్టం’ తెలుసా మీకు.?
ఏదన్నా కష్టమే మరి.! ఔను, కొరటాల శివకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది.! మంచి హిట్టు కొడితే తప్ప, కొరటాల శివని జనం నమ్మే పరిస్థితి లేదు. ‘ఆచార్య’తో కొరటాల శివ ఇచ్చిన డిజాస్టర్ అలాంటిది మరి.
హీరోయిన్‌కి అంత సీన్ వుంటుందా.?
ఇంకో డౌటానుమానం ‘దేవర’ విషయంలో అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ చుట్టూ చాలా హైప్ క్రియేట్ చేసి, ఆ పాత్రనే సినిమా నుంచి లేపేశారు.

మరి, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విషయంలో ఏం జరుగుతుంది.? ఆమె రోల్ ఎలాంటిది.? నటనకు ప్రాధాన్యమున్న పాత్రేనా.? లేదంటే, ఇదిగో ఇలా గ్లామర్ డోస్‌తో పాటలకే పరిమితమైపోతుందా.?
ప్చ్.. ఎన్నెన్ని అనుమానాలో ‘దేవర’ (Jr NTR Devara) విషయంలో.! అన్ని అనుమానాలకీ, సినిమా రిలీజ్‌తోనే క్లారిటీ వస్తుంది.
