Devil Nandamuri Kalyanram.. ‘డెవిల్’ పేరుతో ఓ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో.! ఈ సినిమాకి దర్శకుడు అభిషేక్ నామా.!
అదేంటీ, దర్శకుడు నవీన్ మేడారం కదా.? మరి, ‘డెవిల్’ పోస్టర్లలో దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా పేరెందుకు కనిపిస్తోంది.?
మొదట్లో అయితే, ‘డెవిల్’ సినిమాకి దర్శకుడు నవీన్ మేడారం అనే పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత సీన్ మారింది.
Devil Nandamuri Kalyanram. క్రియేటివ్ డిఫరెన్సెస్..
నిర్మాతకీ, దర్శకుడికీ ఎక్కడో చెడింది. దాంతో, దర్శకుడ్ని పక్కన పెట్టి, తన పేరుని దర్శకుడిగానూ పేర్కొంటూ నిర్మాత అభిషేక్ నామా హంగామా చేస్తున్నారిప్పుడు.

అసలేం జరిగింది.? అన్నదానిపై ఎవరూ పెదవి విప్పడంలేదు. కాకపోతే, నిర్మాత నవీన్ మేడారం, సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి పేర్కొంటూ ట్విట్టర్‌లో ఓ లేఖ లాంటిది విడుదల చేశాడు.
ఈ విషయమై నిర్మాత అభిషేక్ నామా ఒకింత గుస్సా అయ్యాడట. అందుకే, సినిమా ప్రమోషన్లను ఒకింత డల్లుగానే సాగిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ ఎందుకు పట్టించుకోలేదు.?
నిర్మాతకీ, దర్శకుడికీ గొడవలుంటే.. హీరో కళ్యాణ్ రామ్ అయినా, వాటిని తగ్గించేందుకు ప్రయత్నించాలి కదా.?
దర్శకుడి క్రియేటివిటీని నిర్మాత దోచేస్తుంటే, పట్టించుకోకపోవడమేంటి.? కళ్యాణ్ రామ్ కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.!
సో, సాటి నిర్మాత పట్ల కళ్యాణ్ రామ్ ప్రేమ చూపించాడు తప్ప, దర్శకుడ్ని అర్థం చేసుకోలేదన్నమాట.
వాస్తవానికి కళ్యాణ్ రామ్ దర్శకుల హీరో.. దర్శకుల నిర్మాత కూడా.! కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వుంటాడు. అలాంటి కళ్యాణ్ రామ్ నుంచి.. ఇలా ఎలా.?
నిర్మాత డబ్బులు ఖర్చు పెడతాడు.! కానీ, దర్శకుడు తన కథ కోసం ప్రాణం పెడతాడు. దర్శకుడి గుండె లోతుల్లోంచి కథ పడుతుంది.
నిర్మాతగా, నటుడిగా కళ్యాణ్ రామ్‌కి ఇవేవీ తెలియవని ఎలా అనుకోగలం.? ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.
రేప్పొద్దున్న సినిమా హిట్టయితే సరే సరి.! సినిమా తేడా కొడితేనో.? కళ్యాణ్ రామ్ బాధ్యత తీసుకుంటాడా.? నిర్మాత ఎలాగూ చేసిన పాపానికి అనుభవించక తప్పదు.!