Dhanush Aishwarya Divorce.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి.. అన్నది పాత మాట. కొత్త మాటేంటంటే, వాళ్ల విడాకులకి వోడ్కాగాడి హడావిడి.! తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు.. ఎవరో విడాకులు తీసుకుంటే, సోషల్ మీడియాని ఛండాలం చేసి పాడేస్తోందీ వోడ్కా జీవి.
సెలబ్రిటీల విడాకులు ట్రెండ్ సెట్టర్లుగా మారాయ్. యువతరం ‘పెళ్లి’ అనే ప్రమాదానికి దూరంగా ఉండడానికి సెలబ్రిటీల విడాకులు ఉపయోగపడతాయంటూ.. పిచ్చి పురాణం సోషల్ మీడియా వేదికగా మొదలెట్టాడు మిస్టర్ వోడ్కా. తెలివైనోళ్లు ప్రేమిస్తారట.. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారట.!
వోడ్కా ఎక్కువైతే ఇంతే మరి.!
సంగీత్ అనేది విడాకుల కోసమే చేయాలట. పెళ్లిళ్లు మాత్రం సైలెంట్‌గా చేసేసుకోవాలట.. అబ్బో.! చెప్పుకుంటూ పోతే పెద్ద పురాణమే ఉంది. నిజానికి ఇదొక బూతు పురాణం. ఎందుకంటే, అది ఓడ్కా పురాణం కాబట్టి.

తన ట్వీటుకి పదో, పాతికో, వందో, రెండొందలో కామెంట్లు రావాలని, వందల సంఖ్యలో వేల సంఖ్యలో రీ ట్వీట్లు, లైకులూ రావాలన్న కక్కుర్తి తప్ప వోడ్కాజీవి మ్యాటర్ ఎప్పుడో ఖాళీ అయిపోయింది.
Dhanush Aishwarya Divorce.. ఎందుకిలా.?
అసలు విషయంలోకి వద్దాం. తమిళ నటుడు హీరో ధనుష్, 18 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశాడు. 18 ఏళ్ల క్రితం రజనీకాంత్ కుమార్తై ఐశ్వర్యను వివాహమాడాడు ధనుష్.
ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఏనాడూ ఈ జంట వివాదాలకెక్కలేదు. వీరి అన్యోన్య దాంపత్యానికి ఏ ఓడ్కా దిష్టి తగిలిందో కానీ, ఇద్దరూ విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించారు.
Also Read: సిగరెట్టు.. అందాల భామల కనికట్టు.!
కలిసి వైవాహిక జీవితంలో కొనసాగలేమని భావించి, విడాకులు తీసుకోవడాన్ని తప్పు పట్టలేం. అలాగని వివాహ వ్యవస్థని కించపర్చగలమా.?
భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత గొప్పది. బలమైనది. ఆ వ్యవస్థకి తూట్లు పొడిచేందుకు ఆనాటి బ్రిటీష్ కాలం నుంచీ, ఈనాటి ఓట్కా ట్రెండ్ వరకూ చాలా ప్రయత్నాలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయ్.
ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం తెగిపోతే, దాన్ని వ్యవస్థకు ఆపాదించగలమా.? నాన్సెన్స్.. విడిపోయిన వాళ్లను చూసి పైశాచికత్వం పొందేవాడిని ఏమనగలం.? వాడి మానసిక స్థితిని చూసి కాస్త జాలి పడగలం.. అంతే.