Dhruv Vikram Bison Review.. ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘బైసన్’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
తమిళంలో మాత్రం, వారం రోజుల ముందుగా.. అంటే, ఈ నెల 17 విడుదలవుతుంది. మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన ‘బైసన్’, స్పోర్ట్స్ డ్రామా.! యాక్షన్ విత్ ఎమోషనల్ కంటెంట్.. ఈ సినిమాకి ప్రధాన బలం.. అని అంటున్నారు.
Dhruv Vikram Bison Review.. ఫస్ట్ రివ్యూ ఇదీ..
ఆల్రెడీ ఓవర్‌సీస్ నుంచి ‘బైసన్’ సినిమాకి సంబంధించిన టాక్ వచ్చేస్తోంది. దుబాయ్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తే, సినిమా బ్లాక్‌బస్టర్ అని చెప్పుకోవాల్సందే.

హీరోగా ధృవ్ విక్రమ్, ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడట. యాక్షన్ సీన్స్‌లో అయినా, ఎమోషనల్ సీన్స్‌లో అయినా, తండ్రికి తగ్గ తనయుడని ధృవ్ విక్రమ్ అనిపించుకున్నాడట.
ఎమోషనల్ సీన్స్‌లో అయితే విక్రమ్ మరింత ఆకట్టుకుంటాడని దుబాయ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్‌ని బట్టి తెలుస్తోంది.
Also Read: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.! సాధ్యమేనా.?
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. చాలా బావున్నాయని అంటున్నారు. ప్రధాన పాత్రల్ని దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశాడనీ, నటీ నటులు ఆయా పాత్రలో ఒదిగిపోయారని చెబుతున్నారు.
దుబాయ్‌లో సెన్సార్ సమయంలో, ఇలా సినిమాలకు సంబంధించిన టాక్ బయటకు రావడం సహజమే. అలా వచ్చే టాక్ దాదాపుగా నిజమవుతుంటుంది.
మరోపక్క, సినిమాకి తమిళనాడు సహా, తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ‘తండ్రికి తగ్గ తనయుడు’ అంటూ ఆల్రెడీ ధృవ్ విక్రమ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీజర్, ట్రైలర్.. వీటితోపాటు ఆడియో సింగిల్స్.. అన్నీ, సినిమాకి పాజిటివిటీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాని ‘జగదంబి’ సంస్థ విడుదల చేస్తోంది.
