‘గల్ఫ్’ అనే ఓ చిన్న తెలుగు సినిమాలో నటించిన డింపుల్ హయాతీ (Dimple Hayathi Hot and Spicy Beauty), చిన్న గ్యాప్ తర్వాత ‘గద్దల కొండ గణేష్’ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటమ్ బాంబులా పేలింది. ‘జర్రా జర్రా.. సూపర్ హిట్టు నీ బొమ్మ..’ అంటూ సాగే పాటలో హాటుహాటుగా చిందులేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు వరుస సినిమా ఛాన్సుల్ని సొంతం చేసుకుంటోంది.
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తోన్న ‘కిలాడీ’ (Khiladi Raviteja) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించింది. తమిళ హీరో విశాల్ కొత్త సినిమాలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
మామూలుగా అయితే, ఓ సారి ‘ఐటమ్ సాంగ్’ చేస్తే కొత్త భామలకు హీరోయిన్‌గా అవకాశాలు దక్కడం కష్టమే. అదే స్టార్ హీరోయిన్లు అయితే, స్పెషల్ సాంగ్స్ చేసినందుకుగాను భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుంటారు. డింపుల్ హయాతీ విషయానికొస్తే, ఆమెకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే స్పెషల్ సాంగ్ చేయడానికి ఏమాత్రం మొహమాటపడలేదు.
నటిగా ప్రూవ్ చేసుకోవడంతోపాటు, తనకిష్టమైన డాన్స్ కోసం స్పెషల్ సాంగ్స్ వీలైనప్పుడల్లా చేస్తుంటానని డింపుల్ హయాతీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హిందీ సినిమాలో కూడా నటిస్తోంది డింపుల్ హయాతీ (Dimple Hayathi Hot and Spicy Beauty).