కొత్తగా కామెంటేటర్ అయ్యాడు కదా. కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించాడంతే. అప్పటిదాకా కామెంటరీ అదరగొట్టేశాడుగానీ, ‘బ్యాటింగ్’ కాస్త అదుపు తప్పింది.. అంతే, గూబ గుయ్యిమనేలా రెస్పాన్స్ వచ్చింది. ఆఖరికి సొంత ఇంట్లో కూడా మనోడి తీరుని తప్పు పట్టేసరికి, క్షమాపణ చెప్పక తప్పలేదు. ఔను, దినేష్ కార్తీక్ (Dinesh Karthik Apologies for Dirty Commentary) తప్పు తెలుసుకున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ అనదగ్గ స్థాయిలో కొన్ని మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్ (Dinesh Karthik) సత్తా చాటాడుగానీ, అతని టాలెంట్‌కి తగ్గ షో అయితే కెరీర్ మొత్తంలో చాలా తక్కువ సార్లు మాత్రమే చేశాడు. వాస్తవానికి నెంబర్ వన్ క్రికెటర్ అయ్యేందుకు అన్ని అర్హతలూ వున్నాయి దినేష్ కార్తీక్‌కి. కానీ, టైమ్ కలిసి రాలేదంతే.
Also Read: ఛీ పాడు.. ‘అలా’ నన్ను చూడొద్దు.!
ఓ మ్యాచ్ సందర్బంగా కామెంటేటర్ అవతారమెత్తిన దినేష్ కార్తీక్.. కామెంటరీ బాగానే చేశాడు. కామెంటరీకి తమదైన చతురత జోడిస్తే కామెంటేటర్లుగా మంచి పేరు దక్కతుంటుందనే కోణంలో చాలామంది బీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేస్తుంటారు మాటల ద్వారా. అదే పని చేశాడు దినేష్ కార్తీక్ కూడా.
‘బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్లను ఇష్టపడుతున్నట్లు కనిపించరు. ఇతర ఆటగాళ్ళ బ్యాట్లను ఇష్టపడుతుంటారు. బ్యాట్లు అనేవి చుట్టుపక్కల వుండే పరాయి పురుషుల భార్యల్లాంటివి.. అవెప్పుడూ సౌకర్యవంతంగా వుంటాయి బ్యాటర్లకి..’ అంటూ సెటైరేశాడు దినేష్ కార్తీక్ ఓ మ్యాచ్ సందర్భంగా.
Also Read: ఆలస్యంగా ‘ఆ తప్పు’ తెలుసుకున్నా..
ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేపింది. చివరికి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా దినేష్ కార్తీక్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన దినేష్ కార్తీక్, ఆ సమయంలో నా ఉద్దేశ్యం వేరేగా వుంది. నా మాటల్లో తప్పులు దొర్లాయి.. అంటూ క్షమాపణ (Dinesh Karthik Apologies for Dirty Commentary) చెప్పక తప్పలేదు. ఇంకోసారి ఇలా జరగదని కూడా చెప్పుకొచ్చాడు దినేష్ కార్తీక్.
నోటి దురద ఎక్కువైతే ఇలాగే వుంటుంది మరి.