Director Shankar Lanjam.. లంచం గురించి మాట్లాడుతూ దర్శకుడు శంకర్ ‘లంజం’ అని పేర్కొన్నాడు.! తమిళ దర్శకుడు కదా, ‘లంజం’ అని నోటి వెంట వచ్చేసింది.
తమిళంతో కాస్తంత టచ్ వున్నవారెవరికైనాసరే, ‘చ స్థానంలో జ’ మామూలుగానే వచ్చేస్తుందని ఇట్టే అర్థమయిపోతుంది.
కానీ, చాలామంది ఈ విషయమై శంకర్‌ని దారుణంగా ట్రోల్ చేసేశారు. ఆ ట్రోలింగ్‌ని దర్శకుడు శంకర్ పట్టించుకుంటాడా.? అన్నది వేరే చర్చ.
లంచం కాస్తా.. లంజం అయ్యింది.!
ఈ ట్రోలింగ్ వ్యవహారం శంకర్ దృష్టికీ వెళ్ళిందేమో.. ఆ తర్వాత ఆయన ‘లంచం’ అనే ప్రస్తావించాడు. ఇదంతా ‘భారతీయుడు-2’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా జరిగిన వ్యవహారం.
గతంలో స్పీకర్‌గా పనిచేసిన ఓ పొలిటీషియన్, ‘రాజకీయ లంజత్వం..’ అంటూ నిర్లజ్జగా మాట్లాడితే, అతన్ని చేయాల్సిన రీతిలో ఎవరూ ట్రోల్ చేయలేకపోయారు.
మంత్రులుగా పనిచేసినవాళ్ళూ మీడియా ముందుకొచ్చి బూతులు మాట్లాడారు. ఇలాంటివాటిపైన కదా, ట్రోలింగ్ జరగాల్సింది.?
వాస్తవానికి, దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా సినిమాలు చేసింది లేదు. ‘గేమ్ ఛేంజర్’ ఆయనకి తొలి తెలుగు సినిమా.
చాలా తక్కువ సమయంలోనే తెలుగు బాగా నేర్చుకున్నాడు శంకర్. ఈ విషయంలో తమిళ దర్శకుడు శంకర్‌ని మెచ్చుకుని తీరాల్సిందే.
అంతేగానీ, ఓ పదాన్ని ప్రస్తావించే క్రమంలో ఓ అక్షరం పొరపాటుగా వస్తే, దాన్ని తప్పు పట్టడమేంటి నాన్సెన్స్ కాకపోతే.?