జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీపై స్పందించారు. షర్మిల పార్టీ గురించి స్పందించమని మీడియా అడిగితే, ‘కొత్త పార్టీలు రావాలి.. ప్రజలకు మేలు చేయాలి.. అలా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతిస్తాం..’ అని సమాధానమిచ్చారు. అంతే, బురదలో కూరుకుపోయిన జర్నలిజం నీఛ నికృష్టమైన రీతిలో (Dirty Political Journalism In Telugu Media) దుష్ప్రచారానికి తెరలేపింది.
తెలంగాణలో షర్మిల పార్టీని స్వాగతించిన పవన్ కళ్యాణ్.. తెలంగాణలో రాజకీయాలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులున్నాయన్న పవన్ కళ్యాణ్.. అంటూ తెలుగునాట ఓ వర్గం జర్నలిజం విషం చిమ్మే ప్రయత్నం చేసింది.
Also Read: సినిమా రివ్యూ.. ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి, తాను రాజకీయాలపై అవగాహనతో వున్నాననీ, ఉద్యమ నేల తెలంగాణపై యువత రాజకీయాల్లోకి రావాల్సి వుందని పవన్ అభిప్రాయపడ్డారు.
‘ఈ రోజుల్లో రాజకీయమంటే వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే, ఆ పద్ధతి మార్చాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో యువతలో చైతన్యం రావాలి. ఆ చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నాను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
దానికి, బురద జర్నలిజం తీసిన పెడార్థం పైన చూశారు కదా.? నిజానికి, మన సమాజానికి పట్టిన దరిద్రం, రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, ఆ రాజకీయ పార్టీల పంచన పొలిటికల్ వ్యభిచారం చేస్తోన్న కొన్ని మీడియా సంస్థలు, కొందరు జర్నలిస్టులు కూడా.. అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
ఇది ఉత్త విమర్శ మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు పార్టీ జెండాలను మార్చడం కంటే తేలికగానే, కొన్ని మీడియా సంస్థలు రాత్రికి రాత్రి తమ అజెండాల్ని మార్చేసుకుంటున్నాయి.
ప్యాకేజీ డీల్స్‌లో భాగంగా.. పొద్దున్న ఓ పార్టీకి, సాయంత్రం మరో పార్టీకి మద్దతివ్వడం మొదలెట్టాయి. ఇలాంటి చెత్త మీడియా భావజాలం నుంచి సమాజాన్ని తప్పుదోవ పట్టించే కథనాలు (Dirty Political Journalism In Telugu Media) తప్ప, సమాజానికి ఉపయోగపడే వార్తలు ప్రజలకు అందుతాయని ఎలా ఆశించగలం.?
