Disha Patani Kanguva.. అరరె.! ఎంత పనైపోయింది.? దిశా పటానీ సీన్స్‌కి కత్తెరేసేశారట.! ఎలా.? ఎందుకు.? ఎక్కడ.? ఏ సినిమా కోసం.?
తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కంగువ’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఆడియో సింగిల్ బయటకు వచ్చింది.
తెలుగులో ఈ పాటకి నటి శ్రద్ధా దాస్ గొంతు కలిపింది కూడా.! దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Disha Patani Kanguva.. డోసు ఎక్కువైతే.. కత్తెరేశారు.!
అదే, ఆ శ్రద్ధా దాస్ పాడిన పాటలోనే, దిశా పటానీ గ్లామర్ ఒకింత ఎక్కువైపోయిందట.! అద్గదీ సంగతి. సెన్సారోళ్ళు, ఆ పాటలో దిశా పటానీ అందాల ప్రదర్శనకి కత్తెరేశారు.
గతంలో, ‘సింగం’ సినిమా విషయంలో హీరోయిన్ అనుష్కకీ ఇదే పరిస్థితి వచ్చింది. అప్పట్లో, ఆ పాటలోని అనుష్క గ్లామర్‌ని ‘బ్లర్’ చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు, ‘కంగువ’ సినిమాలో దిశా పటానీ అందాల ప్రదర్శనకి కూడా అలానే, గ్రాఫిక్స్ పరదా.. వేసేస్తున్నారు.
జస్ట్ ఆడియో సింగిల్ విషయంలోనే ఇలా కత్తెర పడిందంటే, సినిమాలో ఇంకెంత ‘బ్లర్’ చేసేస్తారో.. అసలెందుకు అంత వల్గర్‌గా ఆ పాటని తెరకెక్కించాల్సి వచ్చిందో.!
సూర్య సినిమాలకి లేడీ ఫ్యాన్స్ కూడా వుంటారు. పిల్లలు కూడా ఎక్కువగానే సూర్య సినిమాల్ని చూస్తుంటారు. మరి, సూర్య ఎందుకు జాగ్రత్తపడలేకపోయాడబ్బా.?
నిజానికి, దిశా పటానీకి ఈ తరహా గ్లామర్ జస్ట్ జుజుబి.! సోషల్ మీడియాకి సెన్సార్ వుండదు గనుక, విచ్చలవిడిగా చెలరేగిపోతుంది.
అయినా, ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో, ఇంకా ఈ సెన్సార్ కట్స్ ఏంటి ఛండాలం కాకపోతే.? అనేవారూ లేకపోలేదు.