Disha Patani Prabhas..‘అట్లుంటది ప్రభాస్‌తోని’ అనని ‘డార్లింగ్స్’ వుండరు. ప్రభాస్‌కి స్నేహితులెక్కువ.. అందర్నీ ‘డార్లింగ్’ అని పిలుస్తుంటాడు ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్.!
మరీ ముఖ్యంగా, ఏదన్నా సినిమా కోసం స్టార్లతో కలిసి పని చేసేటప్పుడు, హైద్రాబాద్‌లో గనుక షూటింగ్ జరిగితే, ఇంటి నుంచే ఫుడ్ తీసుకొచ్చి, వాళ్ళకు రుచికరమైన భోజనాన్ని అందిస్తుంటాడు.
ఈ క్రమంలో అందాల భామలు తెగ ఇబ్బంది పడిపోతుంటారు.
ఎందుకంటే, ఫిట్నెస్ కాపాడుకునేందుకు నానా తంటాలూ పడే హీరోయిన్లు, ప్రభాస్ నుంచి వచ్చే భోజనం క్యారేజీల్ని చూసి లొట్టలేయకుండా వుండలేరు.. వాటి కారణంగా తమ డైట్ ప్లాన్ పాడైపోతుంటే తట్టుకోలేరు.!
తాజాగా, ఈ కష్టం మరో బ్యూటీకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ.
Disha Patani Prabhas.. భోజనం తెచ్చిన కష్టం.!
ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. దిశా పటానీ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది.

ఇంకేముంది, ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం చూసి దిశా పటానీ అవాక్కయ్యింది. ‘అత్యంత రుచికరమైన భోజనంతో మమ్మల్ని చెడగొడుతున్నావ్..’ అంటూ దిశా పటానీ, సోషల్ మీడియాలో ప్రభాస్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
అంతేనా, ఇంత రుచికరమైన భోజనాన్ని తెప్పించినందుకు థ్యాంక్స్ కూడా చెప్పింది ప్రభాస్‌కి దిశా పటానీ.
డబుల్ వర్కౌట్స్ తప్పవేమో.!
ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్.. అంటే దానికి కేరాఫ్ అడ్రస్ దిశా పటానీ. స్విమ్మింగ్, డాన్సింగ్, ఇతర సాధారణ కసరత్తులే కాదు, బీభత్సమైన రీతిలో కిక్ బాక్సింగ్, కరాటే వంటివి కూడా చేసేస్తుంటుంది దిశా పటానీ ఫిట్నెస్ కోసం.
Also Read: లక్కు తోక తొక్కిన సమంత.! ‘సుడి’ ఆ రేంజ్‌లో వుంది మరి.!
అంతలా వర్కౌట్స్ చేయబట్టే, తాను ఇంత ఫిట్‌గా వుంటానని చెప్పే దిశా పటానీ, ‘ప్రాజెక్ట్ కె’ కోసం హైద్రాబాద్‌లో షూటింగ్ జరిగినన్నాళ్ళూ, ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం దెబ్బకి, వర్కౌట్ సెషన్స్ డబుల్ చేసుకోవాలి.. వీలైతే, ట్రిపుల్ కూడా చేసుకోవాలి.!