Disha Patani Self Styling.. ‘మేకప్ మ్యాన్ లేడా..? అని హీరోయిన్ అడిగితే, ‘లో బడ్జెట్ మూవీ మేడమ్, ప్లీజ్ అర్ధం చేసుకోండి ఈ సారికి మీకు మీరే మేకప్ చేసేసుకోండి..’ అంటూ మేకప్ కిట్ హీరోయిన్ కృతిశెట్టి చేతికందిస్తాడు.. నాని ఫ్రెండ్ అయిన అభినవ్ గోమటం.
చేసేదేం లేక మేకప్ కిట్ తీసుకుని, కృతిశెట్టి తనకు తానే మేకప్ చేసుకుంటుంది. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఇది నాని, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలోని ఒక సీన్.
సరే, ఇప్పుడీ సీన్ ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే, ‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీ కూడా తనకు తానే ఓన్‌గా మేకప్ వేసుకుంది. అయితే ఇది ఏ సినిమాలోని సీన్ కోసం కాదులెండి.
Disha Patani Self Styling.. ఆమె రూటే సెపరేటు.!
దిశా పటానీ చేసే సినిమాలకేం లోటు బడ్జెట్స్ వుండవ్. అలాగే, మేకప్ మేన్ లేకుండా పాప కెమెరా ముందుకూ రాదు. కానీ, అప్పుడప్పుడూ దిశా పటానీ ఓన్‌గా మేకప్ వేసుకుంటూ వుంటుందట.

అలా ఓన్ మేకప్ వేసుకుని దిగిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. బికినీలూ, డిఫరెంట్ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం దిశా పటానీ చేసే గ్లామర్ ఫోటో సెషన్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా వుంటాయ్ ఈ పిక్స్ కూడా.
స్పెషల్ ఫోటో సెషన్స్ కోసం మేకప్ మేన్ చేసిన మేకప్ లుక్స్‌తో గ్లామర్ ఒలకబోయడమే కాదు, తన నేచురల్ గ్లామర్‌ని సొంతంగానూ ఎలా ఎలివేట్ చేసుకోవాలో.. ఆ కిటుకు బాగా తెలిసిన ముద్దుగుమ్మే దిశా పటానీ.
ఇక లేటెస్టుగా దిశా పటానీ నెట్టింట పోస్ట్ చేసిన పిక్స్ నిజంగానే అద్భుతహ అనిపిస్తున్నాయ్. ఈ పిక్స్‌లో తన అందానికి తానే మెరుగులు దిద్దుకుందట దిశా పటానీ.
నో మేకప్ మేన్.. ఓన్ హెయిర్ స్టైల్..
నో మేకప్ మేన్. ‘హెయిర్ స్టైల్, నుంచి ఫేస్ మేకప్, డ్రస్ సెలెక్షన్ అంతా నేనే చేసుకున్నా..’ అంటూ ఈ పిక్స్ పోస్ట్ చేసింది దిశా పటానీ.
Also Read: Sonam Kapoor.. అలా చెప్తేనే ‘కిక్కు’ వస్తుందట.!
డార్క్ మోడ్‌లో దీర్ఘంగా ఆలోచిస్తున్నపిక్ ఒకటి, గోల్డెన్ షైన్స్‌తో తళుకులీనుతున్న పిక్ ఇంకోటి. కుర్రకారుకు కిక్కు రేపేలా వున్నాయ్ ఈ పిక్స్.
యాక్షన్ గాళ్ ఇమేజ్‌తో దిశా పటానీ బాలీవుడ్‌లో జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. అలాగే, స్పెషల్ సాంగ్స్‌లోనూ ఇరగదీసేస్తుంటుంది.
ఈ మధ్యనే సౌత్‌లో కూడా సత్తా చాటాలనే వుద్దేశ్యంలో దిశా పటానీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది.