బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu)తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన బ్యూటీ దివి (Divi Vadthya). ఆ సీజన్ బిగ్‌బాస్ షోకి హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
నిజానికి తన అందం, ఆకర్షణ, పర్‌ఫామెన్స్‌తో దివి బిగ్‌బాస్ వీక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
కానీ, అర్ధాంతరంగా దివిని సగం రోజులకే హౌస్ నుంచి ఎలిమినేట్ చేసేశాడు బిగ్‌బాస్. దివి బయటికొచ్చేశాకా, బిగ్‌బాస్ షోకి క్రేజ్ తగ్గిపోయిందన్న టాక్ కూడా బయట వినిపించింది ఆ టైమ్‌లో.
Divi Vadthya… దివికి అన్యాయం చేసిన బిగ్‌బాస్..
ఆ రకంగా బిగ్‌బాస్ దివికి అన్యాయం చేశాడంటూ ఆ తర్వాత దివి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున రచ్చ చేశారు కూడా.
అయితేనేం, ఫినాలే షో సందర్భంగా, షోకి ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దృష్టిలో పడింది దివి.

అమ్మడి ఒడ్డూ పొడుగూ, సినిమాపై వున్న ప్యాషన్ చూసి అదే వేదికపై మాటిచ్చేశాడు చిరంజీవి. తన సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇస్తాను తప్పకుండా అని ప్రామిస్ చేశాడు.
బిగ్‌బాస్ టైటిల్ దక్కించుకోకపోతే ఏంటీ.? అంతకు మించిన బంపర్ ఛాన్స్ కొట్టేసింది అలా దివి. అయితే ఏదో మాటిచ్చాడులే.. ఎప్పుడు ఛాన్సివ్వాలి.. అనుకున్నారంతా. కానీ, అక్కడున్నది మెగాస్టార్.
మెగాస్టార్ మాట ఇస్తే.. అది శాసనమే..
మాటిచ్చాడంటే, మడమ తిప్పేదే లే.. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో దివి పాపకి చిన్నదే అయినా చాలా ఇంపార్టెంట్ అండ్ తనతో క్లోజ్‌గా స్ర్కీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేశాడట.
Also Read: Megastar Chiranjeevi హాట్ అప్పీల్.! శ్రీముఖి మెలికల్.!
ఇంకేముంది దివి పాప ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. తాజాగా ఆ విషయాన్ని రివీల్ చేస్తూ, దివి ఒకింత ఉద్వేగానికి లోనైంది. బిగ్ స్క్రీన్‌పై తనను తాను ఒక్కసారైనా చూసుకోవాలన్న కోరిక దివికి ఇలా నెరవేరింది.
కెరీర్ మొదట్లోనే మెగాస్టార్‌తో కలిసి నటించే ఛాన్స్ దక్కడంతో, ఓ నటిగా చాలా చాలా గర్వంగా ఫీలవుతున్నానని దివి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.