బిగ్ హౌస్ నుంచి ఈ వారం బయటకు వెళ్ళబోయే కంటెస్టెంట్ ఎవరు.? ఎలిమినేషన్ కోసం దివితోపాటు (Divi Vadthya Eliminated) నోయెల్, అరియానా, అవినాష్, మోనాల్, అబిజీత్ నామినేట్ అయిన విషయం విదితమే. వీరిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే మోనాల్ గజ్జర్‌కి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
మోనాల్ కంటే బెటర్ పొజిషన్‌లో వున్న దివి ఎలిమినేట్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, ఈ సీజన్ మొదటి నుంచీ జరుగుతున్న ట్రెండే ఇప్పుడు కూడా నడుస్తోందని అనుకోవాలి. ఓట్లతో కాకుండా, బిగ్‌బాస్ వేరే ఆలోచనలతో కంటెస్టెంట్స్‌ని బయటకు పంపడమో, ఇంట్లో వుంచడమో చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోందిక్కడ.
కుమార్ సాయి ఎలిమినేషన్‌లోనూ ఇదే జరిగింది. దేవి నాగవల్లి విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకిలా.? హౌస్‌లో మోనాల్‌ని ఎందుకు వుంచుతున్నారు.? అఖిల్‌ని ఎందుకు కొనసాగిస్తున్నారు.? రెండు మూడుసార్లు ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ ఎందుకు తప్పించుకున్నాడు.? వంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
కాగా, కుమార్ సాయి ఎలిమినేషన్ సమయంలో ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో చాలా డిమాండ్లు వచ్చాయి. గత సీజన్‌లో అలీ రెజా విషయంలో ఇలాగే జరిగింది. అయితే, అలీ రెజాని నాటకీయంగా బయటకు పంపి, ఆ తర్వాత మళ్ళీ లోపలకి పంపారు. కానీ, ఈసారి కరోనా నేపథ్యంలో ఓ సారి బయటకు వెళితే తిరిగి రావడం అనేది జరిగే పని కాదు.
ఇక, ఈ వీకెండ్ షోకి కింగ్ నాగార్జున దూరంగా వున్నాడు. ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం మనాలీలో వున్న నాగ్, తన కోడలు అక్కినేని సమంతని బిగ్ హోస్ట్‌గా పంపాడు. మరి, సమంత.. దివిని బయటకు పంపేస్తుందా.? ఆమెను బయటకు పంపేయడానికి అసలు కారణమేంటి.?
కారణాల గురించి మాట్లాడుకోవాలంటే, ఈ మధ్య దివికి అస్సలు స్క్రీన్ స్పేస్ దక్కడంలేదు. ఆమెపై టాస్క్‌ల సమయంలో కూడా పెద్దగా ఫోకస్ వుండడంలేదు. మరోపక్క, అమ్మ రాజశేఖర్ కారణంగా దివి సరైన ఆట ఆడలేకపోతోందనే విమర్శలూ వున్నాయి. ఇంతకీ, దివి ఎలిమినేషన్ (Divi Vadthya Eliminated) నిజమేనా.?