‘మీ సినిమాలో దివికి ఛాన్స్ ఇవ్వండి..’ అంటూ హీరో కార్తికేయను రిక్వెస్ట్ చేసింది సమంత అక్కినేని. బిగ్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం మనాలి వెళ్ళడంతో, ఆయన ప్లేస్‌లో దసరా స్పెషల్ ఎపిసోడ్‌ని హోస్ట్ చేసిన అక్కినేని కోడలు, దివిని ఎలిమినేట్ (Divi Vadthya Eliminated) చేసిన విషయం విదితమే.
అయితే, దివికి కార్తికేయ ఛాన్స్ ఇవ్వడమేంటి.? అలాగని సమంత రిక్వెస్ట్ చేయడమేంటి.? దీన్ని సెటైరికల్‌గానే చూడాలన్న చర్చ జరుగుతోంది. దివి అంటే సమంతకి మరీ ఇంత కామెడీ అయిపోయిందా.? అని దివి అభిమానులు గుస్సా అవుతున్నారు.
సమంత ఉద్దేశ్యం ఏదైనా, కార్తికేయను రిక్వెస్ట్ చేయడం బాగా లేదు. అదే సమయంలో ‘ఆమెకు నేను ఛాన్స్ ఇవ్వడమేంటి.? మహేష్ సినిమాలోనే చేసింది కదా..’ అంటూ కార్తికేయ అనడం కూడా ఎక్కడో కాస్త నెగెటివ్ వైబ్ కనిపించిందన్నది దివి అభిమానుల వాదన.
మరోపక్క, అక్కినేని కాంపౌండ్‌లో చాలామంది నటులున్నారు. అఖిల్ సినిమాల్లో దివికి ఛాన్స్ ఇవ్వొచ్చు.. నాగచైతన్య సినిమాల్లోనూ దివికి ఛాన్స్ ఇవ్వడానికి స్కోప్ వుంది. నాగార్జున సినిమాల్లోనైనా దివికి అవకాశం కల్పించొచ్చు.
ఇన్ని అవకాశాలు పెట్టుకుని, సమంత.. ఇంకో హీరోని అడగడమేంటి.? అనేది చాలామంది వాదన. ఈ సీజిన్‌లో ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్‌కీ దక్కని ప్రత్యేక గౌరవం దివికి దక్కిందని కొందరంటున్నారు. హౌస్ నుంచి బయటకొచ్చిన దివికి, స్టేజ్ మీదకు గ్రాండ్ వెల్‌కం కార్తికేయ ద్వారా ఇప్పించింది దివి.
అయితే, బయటకు వచ్చిన తర్వాత హౌస్‌మేట్స్‌తో దివి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడం ఆశ్చర్యకరమే. షూట్ చేసి, ఆ పార్ట్‌ని లేపేశారా.? అన్నదీ అనుమానమే. ఎందుకంటే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎవరి గురించి దివి నిజంగా ఏమనుకుంటుంది.? అనేది తెలియాలి.
ఏదిఏమైనా, దివి ఎలిమినేషన్‌ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దివి సరిగ్గా టాస్క్‌లు ఆడలేదు.. అనే కంప్లయింట్ వున్నా, ఆమెతో పోల్చితే హౌస్‌లో చాలామంది టాస్క్‌లలో ఫెయిల్ అయ్యారు. దివితో పోల్చితే తక్కువ ఫాలోయింగ్ వున్నవారు, తక్కువ ఓట్లు దక్కినవారు హౌస్‌లో ఇంకా వుండిపోయారనే చర్చ జరుగుతోంది బిగ్‌బాస్ ఫాలోవర్స్‌లో.