Divi Vadthya Sea Beauty.. మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినిమాల్లో వెలుగు వెలగాలనుకున్న ముద్దుగుమ్మ దివి వద్త్య. ‘లెట్స్ గో’, ‘ ‘సీన్ నెంబర్ 72’ తదతర చిత్రాల్లో నటించింది.
సోషల్ మీడియాలో తనకున్న పాపులారిటీతో బిగ్‌బాస్ గేమ్ షోలో మెరిసింది. గట్టిగా చెప్పాలంటే.. బిగ్‌బాస్ షోతోనే దివి పాపకి దక్కాల్సిన పాపులారిటీ దక్కిందని చెప్పొచ్చు.
ఈ షో కారణంగానే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో కూడా పడిందీ అందాల బొమ్మ. మెగాస్టార్ చిరంజీవి మాటతోనే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌లో నటించి మెప్పించే ఛాన్స్ కొట్టేసింది దివి వద్త్య.
Divi Vadthya Sea Beauty.. అందమే కాదు, అభినయం కూడా.!
లేటెస్ట్‌గా ‘లంబసింగి’ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపించింది. ‘గాడ్ ఫాదర్’ సినిమా తర్వాత పలు చిత్రాల్లో చిన్నా చితకా రోల్స్‌తో ఆకట్టుకుంటోన్న దివికి అసలు సిసలు గుర్తింపు అయితే దక్కడం లేదనే చెప్పాలి.

హీరోయిన్‌కి వుండాల్సిన అన్ని ఫీచర్స్ దివి పాపలో వున్నాయ్. కానీ లక్కే చిక్కడం లేదంతే. అయితే, సోషల్ మీడియాలో దివికి వున్న క్రేజ్ వేరే లెవల్.
ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. తాజాగా బీచ్‌లో దివి పాప చేసిన అందాల దాడిని తట్టుకోవడం కుర్రాళ్ల తరం కాకపోతోంది.
సముద్రంతోనే పోటీ పడేలా.!
వైట్ కలర్ శారీలో బీచ్‌లో చిందులేస్తూ.. హాట్ షో చేసిన దివి వద్త్య ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్. ఎగసి పడుతున్న అలలతో పోటీగా అందాల విందు చేస్తూ కుర్రోళ్లకు సరికొత్త కిక్కిస్తోంది దివి,

అందుకే ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ స్వైర విహారం చేస్తున్నాయ్. కాగా సినిమాల్లో అంతంత మాత్రం ఛాన్సులే అయినా.. దివి వద్త్య ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది.
Also Read: డబ్బు కోసం దిగజారలేను: నివేదా పేతురాజ్
అందమైన ఫిజిక్‌తో పాటూ.. ఎలాంటి రోల్ ఇచ్చినా తనదైన పర్‌ఫామెన్స్‌తో హ్యాండిల్ చేయగల సత్తా వున్న ముద్దుగుమ్మ దివి. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ కరెక్ట్‌గా పడితే.. ఇండస్ర్టీలో సెటిలైపోదామని చూస్తోంది.
చూడాలి మరి, ఆ ‘బిగ్’ ఛాన్స్ దివి వద్త్యని ఎప్పుడు, ఎలా వరిస్తుందో.!