బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగు నాలుగో సీజన్‌లో ‘హాట్ అలర్ట్’ సైన్ మోగించిన బ్యూటీస్‌లో దివి (Divi Vadthya) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘చాలా బోల్డ్’ అని నాగ్ నుంచే ప్రశంసలు అందుకున్న దివి (Divi Vadthya Bigg Boss Telugu 4), బిగ్ హౌస్‌లోకి వెళ్ళాక ‘సెటిల్’ అవడానికి కొంత టైమ్ తీసుకుంది.
కానీ, దివి చాలా స్ట్రాంగ్ మైండెడ్. స్ట్రెయిట్ ఫార్వార్డ్ పర్సన్ కూడా. ఇదే విషయం రాను రాను బిగ్ బాస్ వ్యూయర్స్‌కి అర్థమవుతోంది. అయితే, బిగ్ హౌస్‌లో రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో అప్పుడే చెప్పేయలేం. తొలి వారం ఎలిమినేషన్‌లో దివి పేరు కూడా వుంది.
మొదటి రెండు మూడు రోజులు స్క్రీన్ స్పేస్ తక్కువగా దక్కినా, ఆ తర్వాత దివి బాగా హైలైట్ అవుతోంది. డాన్సులు బాగా చేస్తోంటే, తోటి కంటెస్టెంట్స్‌ని బాగా ఎనలైజ్ చేయగలుగుతోంది. అందరిలోనూ కలుపుగోలుగా వుండడం దివికి మరో ప్లస్ పాయింట్.
అలేఖ్య హారిక – దివి కాంబినేషన్ బిగ్ హౌస్‌లో కొంచెం హాట్‌గా, ఇంకొంచెం ప్లెజెంట్‌గా కన్పిస్తోంది. ఈ సీజన్‌కి సంబంధించి టాప్ 5లో నిలిచేందుకు తనకు అన్ని అర్హతలూ వున్నాయన్పించుకుంటోంది దివి. ఇంకోపక్క, దివికి సోషల్ మీడియాలో సపోర్టర్స్ కూడా బాగానే వున్నారు.
దివి ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నామినేట్ అయ్యిందని తెలియగానే, ఎడా పెడా ఓట్లు గుద్దేస్తున్నారు ఆమె మద్దతుదారులు. బ్యాక్ ఎండ్ టీమ్స్ దివి కోసం సమర్థవంతంగానే పనిచేస్తున్నా.. అంతకు మించి ఆమెకు సపోర్ట్ అందాల్సి వుంటుంది.
హౌస్‌లో దివి ఎంత పెర్ఫామ్ చేసినా, దాన్ని మించి బయట ప్రమోషన్ జరగక తప్పదు. ఈ గేవ్‌ు ఫార్మాట్ అలా కన్పిస్తోంది మరి. గత సీజన్ అనుభవాల నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ అంతా బాగా ప్రిపేర్ అయి వచ్చినట్లే వుంది. దివి ఇందుకు మినహాయింపేమీ కాదు.
దివితోపాటు (Divi Vadthya Bigg Boss Telugu 4) హౌస్‌లో చాలామంది ‘ఎంటర్‌టైనర్స్’ వున్నా, ఆమె తనకంటూ ఓ స్పెషల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటే.. ఆమె ముందు ముందు హౌస్‌లో వండర్స్ చేయడానికి ఛాన్స్ వుంటుంది.