Divorce Photo Shoot ఫొటో షూట్.. ఫొటో షూట్.. ఫొటో షూట్.! పసి పిల్లల మీద కెమెరా ఫోకస్ పడకూడదంటారు కొందరు.!
అబ్బే, అదేం లేదు.. అంటూ, పుట్టిన కొన్ని గంటల్లోనే చంటి పిల్లలకు ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు చాలామంది.
జీవితంలోని కొన్ని మధుర క్షణాల్ని కెమెరాల్లో బంధించి, ఆ మధుర జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం.. అన్న గొప్ప భావనని తప్పు పట్టలేం.!
నిండు గర్భిణి.. అత్యంత ప్రమాదకరమైన రీతిలో అండర్ వాటర్ ఫొటో షూట్ చేయించుకోవడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్నకి సమాధానమేది.?
కాదేదీ ఫొటోషూట్‌కి అనర్హం.!
కాదేదీ పైత్యానికి అనర్హం.. అన్నట్లు తయారైంది పరిస్థితి. వాళ్ళెవరో చేయించుకున్నారు, మనమూ చేయించుకుంటున్నాం.. అంటూ ప్రమాదాలతో సావాసం చేస్తున్నారు.
ఎడారిలో ఫొటో షూట్.. మంచు కొండల్లో ఫొటో షూట్.. సముద్రంలో ఫొటో షూట్.. ఈ పిచ్చి కారణంగా చాలా ప్రాణాలు పోతున్నాయ్.
మొన్నీమధ్యనే చెత్త కుప్పల మధ్య.. అందులోని మురుగు నీటి నడుమ.. ఓ జంట ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేయించుకుని వార్తల్లోకెక్కింది.
ఈ వెడ్డింగ్ షూట్స్.. చాలా జీవితాల్ని నాశనం చేసేస్తున్నాయ్.. పెళ్ళి కోసమని చేయించుకున్న పొటో షూట్.. ఆ పెళ్ళి జరగకపోవడానికి కారణమవుతోంది.
Divorce Photo Shoot.. జీవితాలు నాశనమైపోతున్నాయ్..
వధూ వరులుగా పెళ్ళి పీటలెక్కాల్సినోళ్ళు, ఆ ఫొటో షూట్స్ చేయించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు మరి.!
అయినా, వెరైటీ విషయంలో తగ్గేదే లే.. అంటున్నారు చాలామంది.! ఇదిగో, ఇక్కడొకామె డివోర్స్ నేపథ్యంలో ఫొటో షూట్ చేయించుకుంది.
Also Read: Seerat Kapoor: ఎగిరిపోతాం.! మాకు రెక్కలతో పన్లేదు.!
భర్తతో వేగలేక విడాకులు తీసుకుని, ఫొటో షూట్ చేయించుకుని.. ఈ ఫొటో షూట్ సందర్భంగా మాజీ భర్తతో పెళ్ళి ఫొటోని చించి పారేస్తూ.. హంగామా చేసింది.
ఆ చించేస్తున్న ఫొటో చూసుకుంటోంటే, మనసుకి చాలా చాలా ఆనందంగా వుందట ఆమెకి.!
అన్నట్టు, చావుల్నీ ఫొటో షూట్లు వదలడంలేదు. ఖననం జరుగుతున్నప్పుడు, దహనం జరుగుతున్నప్పుడు కూడా ఫొటోలు తీయడం ఫ్యాషన్ అయిపోయింది.!
కాదేదీ ఫొటో షూట్‌కి అనర్హం ఇప్పుడు.!.