Divya Bharathi Goat Bakara.. దర్శకుడు షూటింగ్ స్పాట్‌లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది సినీ నటి దివ్య భారతి.
సుడిగాలి సుధీర్ హీరోగాతెరకెక్కుతున్న ‘గోట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న దివ్య భారతి, ఆ సినిమా దర్శకుడిపై చేసిన ఆరోపణలు పెద్ద రచ్చకే కారణమయ్యాయి.
సోషల్ మీడియా వేదికగా దర్శకుడి కామెంట్స్ మీద, అదే సోషల్ మీడియా వేదికపై నుంచే దివ్య భారతి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.
దాంతోపాటుగా, సినిమాకి సంబంధించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ దర్శకుడిపైనా, హీరో సుడిగాలి సుధీర్ పైనా దివ్య భారతి ఆరోపణలు చేయడం గమనార్హం.

కానీ, ఆ ప్రమోషనల్ ఈవెంట్‌కి అటు దర్శకుడు, ఇటు హీరో సుడిగాలి సుధీర్ కూడా హాజరు కాలేదు. మీడియా ఏవో ప్రశ్నలు అడిగింది, ఆ ప్రశ్నలకు దివ్య భారతి సమాధానమిచ్చింది.
ఆ తర్వాత అంతా కామప్.! ఇంతకీ, ఈ మొత్తం వివాదంలో దివ్య బారతి గెలిచినట్లా.? ఓడినట్లా.? గెలుపోటముల సంగతి పక్కన పెడితే, దివ్య భారతి ‘బకరా’ అయిపోయిందన్నది నిర్వివాదాంశం.
Divya Bharathi Goat Bakara.. అరణ్య రోదనే..
సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి దర్శకుడు, హీరో రాకపోతే ఎలా.? ప్చ్, ఈ విషయంలో నిర్మాతల చేతకానితనం గురించి కూడా ప్రస్తావించుకోవాలి.
సోషల్ మీడియా వేదికగా దర్శకుడు, హీరోయిన్ మీద వెటకారం చేయడం వాస్తవం. దానిపై దుమారం చెలరేగిన విషయమూ తెలిసిందే.
తమిళ మీడియా, ఈ విషయమై తెలుగు సినీ పరిశ్రమని ఓ రేంజ్‌లో విమర్శించింది. అయినాగానీ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు.

ఇంత జరుగుతున్నా హీరో సుడిగాలి సుధీర్ స్పందించకపోవడం కొత్త కొత్త అనుమానాలకు తావిస్తోంది. దివ్య భారతి ఏమీ అనవసరపు వివాదాన్ని రాజెయ్యలేదు.
తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే దివ్య భారతి ప్రస్తావించింది. వాస్తవానికి, దివ్య భారతి ఎవరో తెలుగు సినీ జనాలకి ‘గోట్’ సినిమాకి ముందు తెలియదు.
తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ, తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే, వివాదాలతో హాట్ టాపిక్ అయి కూర్చుంది.
