Diwali Crackers Ban.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాల్లోనూ టపాసులు అలియాస్ క్రాకర్స్ అలియాస్ బాణాసంచా వాడకాన్ని చూస్తున్నాం.
క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా బాణాసంచా వినియోగం తెలిసిందే. తమ టీమ్ గెలిస్తే, సంబరాలు చేసుకోవడానికీ క్రికెట్ అభిమానులకి క్రాకర్స్ కావాలి.
కులమతాలకతీతంగా సంబరాలు, ఆయా మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ బాణాసంచా వినియోగాన్ని చూస్తూనే వున్నాం.
అయితే, ప్రతిసారీ దీపావళి సందర్భంగా క్రాకర్స్ వినియోగంపై విమర్శలు, ఆంక్షలు.. సహజంగానే హిందువుల మనోభావాల్ని దెబ్బ తీస్తున్నాయ్.
Diwali Crackers Ban.. కాలుష్యం.. అందరికీ.. అందరిదీ.!
హిందువులకు ప్రత్యేకమైన పండుగా చెప్పబడే దీపావళి క్రాకర్స్ మాత్రమే కాలుష్యానికి కారణమవుతాయా.? ఇతరత్రా మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో క్రాకర్స్, కాలుష్యాన్ని వెదజల్లవా.?
అసలు, దీపావళి క్రాకర్స్ విషయంలోనే ‘మతం’ కోణాన్ని ఎందుకు చూస్తున్నట్లు.? ఎందుకు నిషేధాజ్ఞలు, విమర్శలు, అభ్యంతరాలు తెరపైకి వస్తున్నట్లు.?

ఇలా హిందూ సమాజంలో ఆవేదన సహజంగానే కనిపిస్తోంది. ఫలానా సమయం లోపలే బాణాసంచా కాల్చాలన్న నిబంధనలు దీపావళికి తప్ప, ఇతరత్రా సందర్భాల్లో ఎందుకు అమలు కావడంలేదు.?
ఔను, కాలుష్యం అందరిదీ. ఎవరు బాణాసంచా కాల్చినా అది కాలుష్య కారకమే. కాకపోతే, దీపావలికి పెద్దయెత్తున బాణా సంచా కాలుస్తారు గనుక, అది ఎక్కువ కాలుష్యాన్నిస్తుంది.
మరి, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం సంగతేంటి.? దాంతో పోల్చితే, దీపావళి క్రాకర్స్ వల్ల వచ్చే కాలుష్యమెంత.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
వినియోగం తగ్గుతూ వస్తోంది..
మారుతున్న జీవన శైలి కారణంగానే, అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయ్. ఈ క్రమంలో బాణాసంచా కాల్చడం పట్ల జనాల్లోనూ ఆసక్తి తగ్గుతున్నమాట వాస్తవం.

శబ్దాన్ని భరించలేక, తక్కువ శబ్దంతో కూడిన టపాసులు కొనేందుకే చాలామంది మొగ్గుచూపుతున్నారు కూడా. మార్పు ప్రజల్లోంచి వస్తే, ఇబ్బంది వుండదు.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
కానీ, నిబంధనల పేరుతో హిందువుల పండగలపై విషం చిమ్మితే.. దాని పర్యవసానాలు వేరేలా వుంటాయన్నది హిందూ సమాజం నుంచి వస్తున్న వాదన.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బాణాసంచా పేల్చినా పక్షులు బెదురుతాయి.. పెళ్ళి వేడుకల్లో బాణా సంచా పేల్చినా మూగ జీవాలు ఇబ్బంది పడతాయ్.

ఇది కూడా కాలుష్యమే. కానీ, ఇలాంటి విషయాలపై ఎవరూ పెదవి విప్పరు. ఇదే చిత్రం.
ఒక్కటి మాత్రం నిజం. దీపావలి అంటే, వెలుగుల పండగ.. దీపాల పండగ. మెడపై నిబంధనల పేరుతో ఆంక్షల కత్తి పెట్టడం సబబు కాదు. ఆంక్షల కత్తి పెట్టడమే.. విపరీత పోకడలకు ఆస్కారమిస్తోంది.
