Sai Pallavi Remuneration.. సూటిగా, సుత్తి లేకుండా.! ఏదన్నా విషయాన్ని స్ట్రెయిట్‌గానే చెప్పేస్తుంటుంది ‘సహజ నటి’ సాయి పల్లవి. ఈ మధ్యన లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఆమె పేరు ముందర చేరిపోయింది.
సినిమా హిట్టయితే రెమ్యునరేషన్లు పెరిగిపోతుంటాయ్. అది హీరోకైనా, హీరోయిన్లకైనా, దర్శకులకైనా, టెక్నీషియన్లకైనా.! మరి, సాయి పల్లవి సంగతేంటి.?
రెమ్యునరేషన్ విషయమై సాయి పల్లవి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. స్వతాహాగా డాక్టరు కదా.! అందుకే, వైద్య వృత్తిని, నటనతో పోల్చింది.!
Sai Pallavi Remuneration.. డాక్టరు ఫీజు.. నటి రెమ్యునరేషన్.!
‘నేను డాక్టరుని.. అందరికీ వైద్యం ఉచితంగా చేయలేను కదా.! డబ్బు ఇవ్వగలిగేవారి దగ్గర తీసుకుని వైద్యం చేస్తాను. అదే, డబ్బులు ఇవ్వలేని వారైతే, వారికి ఉచితంగానే వైద్యం చేస్తాను..’ అని చెప్పింది సాయి పల్లవి.
సినిమాల విషయంలోనూ సాయి పల్లవి ఇదే పద్ధతి ఫాలో అవుతుందట. కొన్ని చిన్న సినిమాలు చేసేటప్పుడు రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించనంటోంది ఈ బ్యూటీ.

‘కొన్ని సినిమాలకు నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేను. ఎందుకంటే, సినిమా బడ్జెట్‌లో సగం నా రెమ్యనరేషన్ అయిపోతుంది..’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
దెబ్బ గట్టిగానే పడుతోంది సుమీ.!
అంటే, సాయి పల్లవి (Sai Pallavi) రెమ్యునరేషన్ చాలా చాలా ఎక్కువేనని అనుకోవాలి. అదెంత.? అన్నదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. రెమ్యునరేషన్ ఇవ్వగలిగే సినిమాలకు గట్టిగానే పిండేస్తుందన్నమాట సాయిపల్లవి.
అందులో తప్పేముంది.? సాయి పల్లవి సినిమాలంటే ఓ బ్రాండ్.! ఆమె పేరు చెప్పి సినిమాలు ఆడేసే సందర్భాలున్నాయ్.
అయితే, ఈ మధ్య సాయి పల్లవి (Sai Pallavi) సినిమాలకు ‘బావుంది’ అనే టాక్ వచ్చినా, సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం ఎక్కువైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
Also Read: నభా నటేష్ ‘డేటింగ్’ పైత్యం.! ఛీ పాడు యాపారం.!
నిజానికి చాలామంది హీరోయిన్లతో పోల్చితే సాయి పల్లవి చాలా చాలా బెటర్. అవకాశాలొస్తున్నాయి కదా.. అని ఏవేవో సినిమాలు చేసేసి, ఇమేజ్ చెడగొట్టుకోవడంలేదు.
రెమ్యునరేషన్ కోసం.. విచ్చలవిడిగా తెరపై అందాల ప్రదర్శనా చేసెయ్యడంలేదు. ఈ విషయంలో సాయి పల్లవిని (Sai Pallavi) మెచ్చుకుని తీరాల్సిందే.