Doppelganger Kalyan Ram Amigos మీకు తెలుసా.? ప్రపంచంలో ఓ మనిషిని పోలినట్టుండే మనుషులు మొత్తంగా ఏడుగురుంటారట.! పెద్దలు చెబుతుంటారు ఈ మాట.!
కవలలు ఒకేలా వుంటారు కదా.? అనే డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు.!
ఐశ్వర్యారాయ్ తరహాలో కనిపిస్తుంటుంది స్నేహా ఉల్లాల్.! మెగాస్టార్ చిరంజీవిలా రాజ్‌కుమార్ అనే ఓ టీవీ నటుడు కనిపిస్తాడు.
చెప్పుకుంటూ పోతే, కథ చాలా చాలా పెద్దదే.! రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో అయితే, అచ్చంగా ఒరిజినల్ అనే తరహాలో డూపుల్ని చూపిస్తుంటాడాయన.. ప్రముఖుల్ని పోలి వుండేలా.
Doppelganger Kalyan Ram Amigos.. ఇంతకీ, డూపుల్గాంగర్ అంటే ఏంటి.?
డూపుల్గాంగర్ అట.! సరిగ్గా పలకడం కూడా కష్టంగానే వుంది కదా.! ఇదీ ఆ ఇంగ్లీషు పదం..! ఇప్పుడు దీని గురించిన చర్చ ఎందుకు.? అంటే, ఇదొక సినిమా కథ.!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ‘అమిగోస్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆషిక రంగనాథ్ హీరోయిన్.
ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ పాత్రని రెండు రకాలుగా పరిచయం చేశారు. దీనికే ‘డూపుల్గాంగర్’ అని పేరు పెట్టారు.
ఓసోస్.. ఎన్ని సినిమాల్లో చూడలేదు.?
మనిషిని పోలిన మనుషుల కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయ్.. వస్తూనే వున్నాయ్. పాత సినిమాల్లో అయితే, పచ్చబొట్టు తీస్తే డూప్లికేట్.. ఆ పచ్చబొట్టు పెడితే ఒరిజినల్.. అన్నట్టుండేది.
మొన్నీమధ్యనే రాజమౌళి (Rajamouli), తాను మహేష్‌తో (Super Star Maheshbabu) తెరకెక్కించే సినిమాకి సంబంధించి ‘గ్లోబ్‌ట్రోటింగ్’ (Globetrotting) అనే ప్రస్తావన తెచ్చాడు.
Also Read: Samantha Ruth Prabhu.. అప్పుడూ! ఇప్పుడూ! అన్నీ మారాయ్.!
అప్పట్లో ఆ పదం ట్రెండింగ్ అయిపోయింది. సాహస యాత్రలు చేసేవాడని.. ఆ పదానికి అర్థమట.
అద్గదీ సంగతి.! కళ్యాణ్ రామ్ నిర్మాతలు కూడా సమ్‌థింగ్ స్పెషల్.. అని మనిషిని పోలిన మనుషులు కాన్సెప్ట్‌తో ఈ ‘డూపుల్గాంగర్’ అనే పేరు తెరపైకి తెచ్చారన్నమాట.