Doube Ismart Kavya Thapar.. రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్ ఈ ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్ (Ram Pothineni) సరసన ఇద్దరు అందాల భామలు నభా నటేష్, నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

యాక్టింగ్ సంగతి పక్కన పెడితే, గ్లామర్ విషయంలో ఒకర్ని మించి ఇంకొకరు.. అన్నట్టుగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ చెలరేగిపోయారు.
Doube Ismart Kavya Thapar.. వాళ్ళిద్దరూ ఓ యెత్తు.. కావ్య థాపర్ ఇంకో యెత్తు..
ఔను, ‘ఇస్మార్ట్ శంకర్’కి డబుల్ డోస్.. అన్నట్టుగా ‘డబుల్ ఇస్మార్ట్’ (Ismart Shankar) సినిమా నుంచి ప్రోమోస్ బయటకు వస్తున్నాయి.. ఆ స్థాయి హుషారుతో.
తాజాగా, ‘మాార్ ముంత.. చోడ్ చింత..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌లో రామ్ పోతినేని డాన్స్, ఆ ఎనర్జీ.. వేరే లెవల్ అంతే. మ్యూజిక్ కూడా మాస్‌ని మెప్పించేలానే వుంది.
రాహుల్ సిప్లిగంజ్ వాయిస్, ఈ పాటకి అవసరమైనంత మాస్ అప్పీల్ ఇచ్చిందన్నది నిర్వివాదాంశం. ఆ మేకింగ్.. ఆ టేకింగ్.. ఆ డాన్సింగ్.. అన్నీ వేరే లెవల్.
అన్నట్టు, ఈ పాటలో రామ్ పోతినేని కంటే అందరి దృష్టీ హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar) మీదకే వెళుతుంది. కారణం, ఆమె ఒలకబోసిన గ్లామరు.. ఆమెలోని డాన్సరూ.!
తెలుసు కదా, ‘ఇస్మార్ట్ శంకర్’లోని ఓ పాటలో అటు నభా నటేష్ (Nabha Natesh), ఇటు నిధి అగర్వాల్ (Nidhhi Agerwal).. ఇద్దరూ చెలరేగిపోతారు డాన్సుల పరంగా.
వాళ్ళిద్దరికీ ఏమాత్రం తగ్గకుండా, ఆ మాటకొస్తే.. ఆ ఇద్దర్నీ మించి, కావ్య థాపర్ అదరగొట్టేసిందనడం అతిశయోక్తి కాదు ‘డబుల్ ఇస్మార్ట్’లో.