ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని (Indian Premiere League 2020) కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఐపీఎల్ షెడ్యూల్ (Dream11 IPL 2020) విడుదలైన విషయం విదితమే. సెప్టెంబర్ 19న ఐపీఎల్ (Dream 11 IPL 2020 Covid 19 Tension) ప్రారంభం కానుంది.
ఒకే రోజు రెండు మ్యాచ్‌లు వుంటే, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదటి ఆట ప్రారంభమవుతుంది. రెండో ఆట సాయంత్రం ఏడున్నరకు మొదలవుతుంది. ఒక రోజు ఒకే మ్యాచ్ వుంటే, అది సాయంత్రం ఏడు గంటల ముప్ఫయ్ నిమిషాలకే ప్రారంభమవుతుంది.

ఇదిలా వుంటే, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకి చెందిన అసిస్టెంట్ ఫిజియో కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. యూఏఈలో ఐపీఎల్ (IPL T20) జరగనుండగా, చెన్నయ్ (Chennai Super Kings) జట్టు కరోనా కారణంగా తీవ్ర సమస్యలే ఎదుర్కొంది. ఆ జట్టుకి సంబంధించి పలువురు కరోనా బారిన పడ్డారు. ఎట్టకేలకు వారంతా కోలుకోవడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
ఇక, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకి చెందిన అసిస్టెంట్ ఫిజియో కరోనా బారిన పడేసరికి అంతా షాక్‌కి గురయ్యారు. అయితే, కాస్త ఆలస్యంగా యూఏఈకి చేరుకున్న అసిస్టెంట్ ఫిజియో, ప్రస్తుతం క్వారంటైన్‌లోనే వుండడం, ఇంతవరకూ ఆయన ఎవరినీ కలవకపోవడంతో ప్రస్తుతానికి పెద్దగా సమస్య లేనట్లే.
కాగా, కరోనా (Corona Virus) ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి అంటుకుంటుందో తెలియక ఆటగాళ్ళు, ఆయా జట్ల యాజమాన్యాలూ తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కరోనా నేపథ్యంలోనే ఐపీఎల్ ఈసారి ఇండియా నుంచి యూఏఈకి వెళ్ళిపోయిన విషయం విదితమే. చైనాతో సరిహద్దు వివాదాల పుణ్యమా అని టైటిల్ స్పాన్సర్ కూడా మారారు.
ఇన్ని మార్పుల నడుమ, ఐపీఎల్ 2020 ప్రశాతంగా జరగాలనే ఆశిద్దాం. గత సమ్మర్‌లో జరగాల్సిన ఐపీఎల్, కరోనా (Covid 19 India) కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.