బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇంతలోనే, మరో నటిని (Kangana Ranaut Drugs Abuse) డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఆ నటి ఎవరో కాదట, కంగనా రనౌత్ అట. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముంబైపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనని సీరియస్‌గా తీసుకున్నట్లే కన్పిస్తోది.
కంగనాపై గతంలోనూ డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆమె మాత్రం ఇప్పుడు చిత్ర విచిత్రంగా మాట్లాడుతోంది డ్రగ్స్ వ్యవహారాలపై. బాలీవుడ్‌లో చాలామంది నటీనటులకు, ఇతర సినీ ప్రముఖులకు డ్రగ్స్ అలవాటు వుందనీ, టెస్ట్‌లు చేస్తే చాలామంది బుక్కయిపోతారనీ కంగన ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కంగనపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కంగనకీ డ్రగ్స్ లింకులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గనుక విచారణ షురూ చేస్తే, ఆమె ఏ క్షణాన అయినా అరెస్ట్ అవ్వొచ్చన్న చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది.
ఇదిలా వుంటే, కంగన తన మీదకు ఏ వివాదమూ రాకుండా, ముందస్తుగా జాగ్రత్త పడుతోంది. అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ టాపిక్‌ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చింది. తన కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి కొందరు అధికారులు జేసీబీలతో వస్తున్నారంటూ నోరు పారేసుకుంది.
ఇవన్నీ ‘టాపిక్ డైవర్షన్’ అంశాలేననీ, కంగన (Kangana Ranaut Drugs Abuse) అసలు కథ ఏంటో ముందు ముందు తెలుస్తుందనీ, మహరాష్ట్రకి చెందిన పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా వుంటే, కంగనా రనౌత్‌కి, ‘వై కేటగిరీ’ భద్రతను ఇటీవల కల్పించిన సంగతి తెలిసిందే కదా.
ఈ ‘వై కేటగిరీ’ భద్రతపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నటికి, పైగా వివాదాలతో పబ్లిసిటీ తెచ్చుకునే వ్యక్తికి ‘వై కేటగిరీ’ భద్రత కల్పించడం సబబు కాదంటూ కొందరు కోర్టునాశ్రయించే పనిలోనూ వున్నారు.