Dude Telugu Review.. ప్రదీప్ రంగనాథన్ మంచి నటుడు. మమిత బైజు వెరీ క్యూట్.! తెలుగులో ‘మైత్రీ’ సంస్థ ఈ సినిమాని తీసుకుంది.!
ఇంతకన్నా, ‘డ్యూడ్’ సినిమాకి తెలుగునాట హైప్ క్రియేట్ అవడానికి కారణం ఇంకేం కావాలి.? ‘బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్’ వేదికపై, ఈ సినిమాని ప్రమోట్ చేశారు కూడా.
రేసులో మూడు తెలుగు సినిమాలు దీపావళికి విడుదలవుతున్నా, వాటితోపాటు ‘డ్యూడ్’ని ధైర్యంగా రిలీజ్ చేసింది మైత్రీ సంస్థ.
సినిమా ప్రమోషన్ల కోణంలో చూస్తే, ‘డ్యూడ్’ గురించిన చర్చ ఎక్కువగా జరిగింది తెలుగు సినీ పరిశ్రమలో. ‘ప్రేమలు’ సినిమాతో మమిత బైజుకి తెలుగులోనూ అభిమానులు పుట్టుకొచ్చారు.
అలానే, ‘డ్రాగన్’ సినిమాతో ప్రదీప్ రంగనాథన్‌కి బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. అలా, ‘డ్యూడ్’పై తెలుగు ప్రేక్షకుల్లోనూ కూసింత ఆసక్తి ఏర్పడింది.
Dude Telugu Review.. ఇంతకీ, ‘డ్యూడ్’ కథా కమామిషు ఏంటి.?
అతడు, ఆమె.. ఇంకొకడు.. ఆగండాగండీ, కాన్సెప్ట్ అర్థమయిపోయిందా.? అర్థమైపోయే వుంటుంది. ఎందుకంటే, ఈ కాన్సెప్ట్‌తో చాలా తెలుగు సినిమాలు వచ్చేశాయ్ గనుక.
ఒకటి కాదు, పది కాదు, పాతిక కాదు.. అంతకు మించిన సంఖ్యలో ఇలాంటి సినిమాలొచ్చాయ్. కొన్ని కథలు సుఖాంతమైతే, కొన్ని కథలు బాధపెట్టాయ్.
హిట్టయినవి కొన్ని.. ఫట్టయినవి కొన్ని. ఇంకా ఇంకా ఇదే కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తూనే వున్నాయి. ఆ కోవలోనిదే ‘డ్యూడ్’ కూడా.!
ఓ అమ్మాయి, అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ప్రేమను కాదంటాడు. ఆ అమ్మాయి, వేరే వ్యక్తితో ప్రేమలో పడ్డాక, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ప్రేమ అర్థమవుతుంది.
ఇంకోపక్క, ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని పెళ్ళి చేసుకున్నాక, మళ్ళీ ఈ అబ్బాయి మీద ప్రేమ పెంచుకుంటుంది. ఇదీ కథ.!
చివరికి ఏమయ్యింది.? అన్నదే మిగతా కథ.! అర్థమయ్యిందా రాజా.? ఎక్కడో చూసినట్టుంది కదా.! చూసే వుంటారు.. ముందే చెప్పుకున్నాం కదా, చాలా సినిమాలు ఇలాంటివి వచ్చాయని.
దర్శకుడి పని తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. పాటలు.. అందులోని సంగీతం, కొరియోగ్రఫీ.. ఇవన్నీ మామూలే.!
కానీ, ప్రదీప్ రంగనాథన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో చాలా మైనస్సుల్ని ప్రదీప్ రంగనాథన్ నటన కారణంగా మర్చిపోతాం.
మమిత బైజు క్యూట్ లుక్స్ కూడా అంతే.! చాలా లూప్ హోల్స్‌ని మనం మర్చిపోయేలా చేస్తుంది మమిత బైజు. ఆమె క్యూట్ అప్పీల్ అలాంటిది.
అయితే, సహజంగానే అరవ అతి చాలా సన్నివేశాల్లో తెలుగు ప్రేక్షకులకు చికాకు కలిగిస్తుంది. ‘టేకిట్ గ్రాంటెడ్’ అన్నట్లు, దర్శకుడు భావించాడేమో అనిపిస్తే, అది మీ తప్పు కాదు.
‘యూత్‌ఫుల్ కంటెంట్’ పేరుతో, కాస్తంత పబ్లిసిటీ.. ఒకింత ‘పీఆర్ స్టంట్స్’ సరిగ్గా ప్లాన్ చేస్తే, జనాల మీదకి ఎలాంటి సినిమానైనా వదిలెయ్యొచ్చు.. అనడానికి, ‘డ్యూడ్’ ఒక నిదర్శనం.
మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాల నడుమ, ‘డ్యూడ్’ని ఆ నమ్మకంతోనే మైత్రీ సంస్థ ప్రేక్షకుల మీదకు వదిలేసిందన్నమాట.!
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
ఆల్రెడీ చెప్పుకున్నట్లు, ప్రదీప్ రంగనాథన్ అలానే మమిత బైజు కాకుండా.. ఇంకెవరు కీలక పాత్రల్లో నటించినా, డ్యూడ్ కాస్తా మట్టిగొట్టకుపోయేదే.!
దీపావళి సీజన్ కదా, తమిళంలో లాభసాటి వ్యవహారమే కావొచ్చు. ‘మిత్ర మండలి’ తేలిపోవడం తెలుగులో, ‘డ్యూడ్’కి ఎంతో కొంత కలిసొచ్చే విషయం కావొచ్చు.
నిజానికి, వన్ టైమ్ వాచ్.. అని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకోలేని పరిస్థితి. ఓటీటీలో అంటారా, టైమ్ పాస్ కోసం ట్రై చేయొచ్చు.
