Dynamite Revanth Reddy HBD.. అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఇక, రాజకీయ జీవితం ముగిసిపోయింది.!
ఇదీ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీకి దొరికిపోయినప్పుడు రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ.
కట్ చేస్తే, ‘అనుముల రేవంత్ రెడ్డి అనే నేను..’ అంటూ, తెలంగాణ ముఖ్య మంత్రి పీఠంపై కూర్చున్నారు.!
‘జైలుకు వెళ్ళి వస్తే చాలు, ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది.. అదో సెంటిమెంటు..’ అని కొందరు పెదవి విరిస్తే, విరవొచ్చుగాక.! కానీ, అందరి విషయంలోనూ అలా జరగదు కదా.?
Dynamite Revanth Reddy HBD.. టీడీపీలో అలా.. కాంగ్రెస్ పార్టీలో ఇలా..
రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎదిగింది తెలుగు దేశం పార్టీలో. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడే కాదు, ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి.!
తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి.
‘కాంగ్రెస్ అనే మహా సముద్రంలో ఎన్నో పిల్ల కాలువలు కలుస్తాయ్’ అనే విమర్శల్నీ రేవంత్ రెడ్డి అప్పట్లో ఎదుర్కొనాల్సి వచ్చింది.
నిజానికి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి అంత తేలిగ్గా అన్నీ సమకూరిపోలేదు. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేశారు రేవంత్ రెడ్డి. అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
‘సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి’ అనే ఇమేజ్ కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లోనే చాలామంది వ్యతిరేకించారు.
కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డిని నమ్మింది. ఆ నమ్మకాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రి అయ్యాక కూడా..
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా, కాంగ్రెస్ పార్టీలో ఆయనంటే గిట్టని వర్గం, ఆయన్ని కిందికి దించేసేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేస్తూనే వుంది.
కానీ, రేవంత్ రెడ్డి అధినాయకత్వం మెప్పు పొందుతున్నారు. తెలంగాణ సమాజం దృష్టిలోనూ తన ఇమేజ్ పెంచుకుంటూ వెళుతున్నారు.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో తీసుకొచ్చిన సంచలనాత్మక సంక్షేమ పథకంగా చెప్పుకోవచ్చు.
రాజకీయ విమర్శల విషయంలో మాట తూలుడు ఎక్కువవుతున్నా, ఇప్పట్లో రేవంత్ రెడ్డికి ధీటుగా నిలబడే రాజకీయ ప్రత్యర్థి తెలంగాణలో ఎవరూ లేరని నిస్సందేహంగా చెప్పొచ్చేమో.
అన్నట్టు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్ గెలిస్తే, తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి తిరుగుండదు.
అందుకేనేమో, ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ రెడ్డి, మాటల తూటాలు పేల్చుతున్నారు రాజకీయ ప్రత్యర్థుల మీద.. ఓ రేంజ్లో.!
నేడు తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి జన్మ దిన శుభాకాంక్షలు.
