Home » ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’.! తిరగబడ్డ భారతావని.!

ఎలాన్ మస్క్ ‘స్టార్ లింక్’.! తిరగబడ్డ భారతావని.!

by Mudra369 Editorial Desk
0 comments
Elon Musk Starlink

Elon Musk Starlink India.. టెస్లా కారు చూసి ముచ్చటపడ్డాం.. స్టార్ లింక్ విషయమై ఎందుకు తిరగబడుతున్నాం.? టెస్లా కారు, కొందరికి మాత్రమే అందుబాటులో వుంది.. ధర పరంగా.

స్టార్ లింక్ వ్యవహారం వేరు. దీనికి కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి వుంది. స్టార్ లింక్ మాత్రమే,

ఈ విభాగంలో పోటీ పడుతున్న ఇతర టెలికాం సంస్థలు (భారతీయ కంపెనీలకు) కూడా, అనుమతుల విషయమై కేంద్రం సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది.

ఏమో రేపో మాపో.. వచ్చే నెలో, వచ్చే ఏడాదో.. ‘స్టార్ లింక్’ భారత దేశంలోకీ అడుగు పెడుతుదేమో.! కానీ, తొందరపడి ఓ కోయిల.. ముందే కూసేసింది.. పిచ్చి కూతల్ని.!

ఎలాన్ మస్క్.. తెలుసు కదా, ప్రపంచ కుబేరుడు.! భారత ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ‘ప్రధాని అంబానీ’ అంటూ వెటకారాలు చేస్తున్నాడు.

Elon Musk Starlink India.. తక్కువ ధరకే ‘స్టార్ లింక్’ అందుబాటులోకి తేవొచ్చు కదా మస్క్ మాయ్యా.!

జియో సంస్థతో స్టార్ లింక్ సంస్థకి పోటీ.! ఆ రెండు సంస్థల మధ్య పోటీ కారణంగా వినియోగదారులకు తక్కువ ధరకే, ఇంటర్నెట్ సేవలు అందితే మంచిదే కదా.!

కానీ, భారత ప్రభుత్వం కుట్ర పూరితంగా ‘స్టార్ లింక్’ సేవలకు అడ్డంకులు సృష్టిస్తోందనీ, అంబానీకి మాత్రమే అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందనీ, ప్రధాని మోడీపై ఆరోపణలు చేస్తున్నాడు ఎలాన్ మస్క్.

బయటి వ్యక్తి ఎలాన్ మస్క్, భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని యావత్ భారత సమాజం తప్పుపడుతోంది.

వ్యాపారం చేయాలనుకునే విదేశీ వ్యాపారవేత్త, కేవలం వ్యాపారిగా మాత్రమే వుండాలి. భారత దేశ వ్యవహారాల్లోకి చొరబడకూడదు.. రాజకీయ విమర్శలు అసలే చేయకూడదు.!

‘ప్రధాని అంబానీ’ అనడం, ఎలాన్ మస్క్ టెంపరితనానికి నిదర్శనం.! వున్నపళంగా ఎలాన్ మస్క్‌కి చెందిన ‘ఎక్స్’ని భారత దేశంలో, భారత ప్రభుత్వం నిషేధించే అవకాశం వుందన్న విషయం ఆయన గుర్తెరగాలి.

కాంగ్రెస్ పార్టీ తప్ప, భారత దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా ఎలాన్ మస్క్‌కి మద్దతుగా మాట్లాడటం లేదు. కాంగ్రెస్ సంగతి తెలిసిందే కదా.!

మస్క్ టెంపరితనం..

నో డౌట్, ఎలాన్ మస్క్ అంటే ఓ సంచలం.. రాకెట్లు, కార్లు.. వాట్ నాట్.. ఏ వ్యాపారం చేసినా, అందులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ‘స్టార్ లింక్’ కూడా ఓ అద్బుతమే కావొచ్చు.

కాకపోతే, కాస్త ఓపిక వుండాలి. బాధ్యత కూడా వుండాలి. టెంపరితనాన్ని దేశం వెలుపలి వ్యక్తి, భారత దేశంపై ప్రదర్శిస్తే.. యావత్ భారత సమాజం తిరగబడుతుంది.

రేపో మాపో ఎలాన్ మస్క్, ఇండియాకి వచ్చి నిరాహార దీక్ష చేసినా చేస్తాడు ‘స్టార్ లింక్’ వ్యవహారమే.! అంతలా దిగజారిపోయాడు.

‘జియో’, ‘ఎయిర్‌టెల్’ లాంటి సంస్థలు అందిస్తున్న ధరలతో పోల్చితే, ‘స్టార్ లింక్’ ధరలు చాలా చాలా ఎక్కువ. సామాన్యుడికి అస్సలేమాత్రం అందుబాటులో లేని ధరలవి.

సరే, ఆ ధరలు నచ్చినోడే కొనుక్కుంటాడు.. అది వేరే సంగతి. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ‘డేటా’ భద్రత. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం, అనుమతుల విషయమై మల్లగుల్లాలు పడుతోంది.

చివరగా.. మస్క్ తన ‘ఎక్స్’ వినియోగదారుల నుంచే, సోషల్ మీడియా వేదికగా చీవాట్లు తింటున్నాడు ఈ విషయమై.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group