Home » ట్రోలింగా.? డోన్ట్ కేర్.! బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గౌరీ కిషన్

ట్రోలింగా.? డోన్ట్ కేర్.! బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గౌరీ కిషన్

by Mudra369 Editorial Desk
0 comments
Gouri G Kishan

Gouri G Kishan Classic.. సినిమాల్లో తెరపై కనిపించే కాన్ఫిడెన్సే నిజ జీవితంలోనూ ప్రదర్శించడంలోనూ తనదైన ముద్ర వేసింది నటి గౌరీ కిషన్.

అందుకు సాక్ష్యం ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఆమె ఫేస్ చేసిన సంఘటన.

ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ తరహాలో అడిగిన ఓ అసభ్యకరమైన ప్రశ్నకు అక్కడికక్కడే ధీటుగా ధైర్యంగా సమాధానం చెప్పి, సెన్సేషనల్ అయ్యింది గౌరీ కిషన్.

ఎలాంటి బెరుకూ లేకుండా హుందాగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు తోడ్పడిన ఈ సంఘటన ఆమెలోని సెల్ఫ కాన్ఫిడెన్స్‌ని పరిచయం చేసింది.

కొంచెం బొద్దుగా వున్నా ముద్దుగా కనిపించే గౌరీ కిషన్.. తెరపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించే పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటుంటుంది. అదే కాన్ఫిడెన్స్‌ని తన నిజ జీవితంలోనూ ప్రదర్శిస్తుంటుంది.

Gouri G Kishan Classic.. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనే క్వీనే సుమా.!

బాడీ షేమింగ్‌కి సంబంధించిన కామెంట్లు చేసే విమర్శకుల నోళ్లు మూయించేలా తన కళ్లల్లో కనిపించే కాంతి, ముఖంలో ‘డోంట్ కేర్’ అని దేనికీ రాజీపడని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిక్స్ అయ్యేలా గౌరీ కిషన్ తాజాగా చేయించుకున్న ఫోటో షూట్ ఒకటి ట్రెండింగ్ అవుతోంది.

మెటాలిక్ చాక్లెట్ బ్రౌన్ అండ్ బ్రాంజ్ కాంబినేషన్‌లో డిజైన్ చేసిన శారీలో గౌరీ కిషన్ మెరిసిపోతూ కనిపిస్తోంది ఈ ఫోటోస్‌లో.

హోటల్ కారిడార్‌ బ్యాక్ డ్రాప్‌లో సినిమాటిక్ లైటింగ్ మధ్య నిలబడి ఆమె ఇచ్చిన పోజులు అదరగొడుతున్నాయ్.

బాడీ షేమింగ్ చేసే వాళ్లకి ధీటైన సమాధానంలా ఆమె నిలబడిన తీరు.. ముఖంలోని చిరునవ్వు చిందిస్తూనే,.. ‘నా శరీరం నా ఇష్టం నా సెల్ప్ కాన్ఫిడెన్సే నా స్టైల్..’ అన్నట్లుగా ఆమె అభిప్రాయాన్ని చెప్పకనే చెబుతున్నాయ్ ఈ స్టిల్స్.

రీసెంట్ సంఘటనతో బాడీ షేమింగ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన గౌరీ కిషన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

అన్నట్లు గౌరీ కిషన్‌కి ఎదురైన ఈ బాడీ షేమింగ్ ఇష్యూపై పెద్ద రచ్చే జరగడంతో తమిళ సినీ ఇండస్ట్రీ అంతా ఆమెకు అండగా నిలబడడం కొసమెరుపు.

విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ‘96’ మూవీలో యంగ్ త్రిష పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఈ సినిమాని తెలుగులోనూ ఇదే టైటిల్‌తో రిలీజ్ చేశారు.

శర్వానంద్, సమంత లీడ్ రోల్ పోషించగా.. గౌరీ కిషన్ యంగ్ సమంత పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.

ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లు, తమిళ డబ్బింగ్ వెర్షన్ సినిమాలూ.. ఇలా గౌరీ కిషన్ కేవలం తమిళ ప్రేక్షకులకే కాకుండా.. తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group