Home » బిగ్ క్వశ్చన్: టీడీపీతో గొడవకి జనసేన సిద్ధమవుతున్నట్లేనా.?

బిగ్ క్వశ్చన్: టీడీపీతో గొడవకి జనసేన సిద్ధమవుతున్నట్లేనా.?

by Mudra369 Editorial Desk
0 comments
Pawan Kalyan Adavi Thalli Baata

Janasenani Plans Against TDP.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరన్నది ప్రముఖంగా వినిపించేమాట.!

రాజకీయ పరిశీలకులు, రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో వాడుతుంటారు ఈ మాటని.

ఆ లెక్కన, తెలుగు దేశం పార్టీ – జన సేన పార్టీ ఏమీ శాశ్వత మిత్రులు కాదన్నమాట.! అలానే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – జన సేన పార్టీ కూడా శాశ్వత శతృవులు కానక్కర్లేదు.!

2014 ఎన్నికల సమయంలోనే టీడీపీతో జత కట్టినా, ఆ ఎన్నికల్లో జన సేన పార్టీ పోటీ చేయలేదు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్యా వైరం పెరిగింది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయ్ టీడీపీ, జనసేన.

కలసి కట్టుగా కూటమిగట్టి.. అధికార పీఠమెక్కి.!

మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు టీడీపీ – జన సేన జట్టుకట్టాయి. టీడీపీ – జన సేన – బీజేపీ కలిసి కూటమి కట్టి, అధికార పీఠమెక్కాయి.

ఇంతకీ, 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, కూటమిగా కలిసి వుండాలన్నది ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ఉవాచ.

రెండు దఫాలు కాదు, మూడు దఫాలు టీడీపీ – బీజేపీ – జన సేన కలిసి వుండాలని పదే పదే టీడీపీ, జన సేన అధినాయకత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే.

Janasenani Plans Against TDP.. 2029 వరకూ అయినా టీడీపీ, జన సేన కలిసే వుంటాయా.?

కానీ, అందుకు తగ్గ అనుకూల వాతావరణం అయితే కనిపించడం లేదు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏ ఉద్దేశ్యంతో ఏ వ్యాఖ్యలు చేసినా, వాటిని టీడీపీలో ఓ వర్గం తప్పు పడుతూ వస్తోంది.

చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నా కలిసే వుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఆ దిశగానే కూటమి పార్టీలు ముందడుగు వేస్తున్నాయి.

అయితే, స్థానిక ఎన్నికల వేళ సీట్ల పంపకాల నేపథ్యంలో వస్తున్న పొరపచ్చాలు కూటమి పార్టీల మధ్య చిచ్చుకి కారణమవుతున్నాయి.

గతంతో పోల్చితే బలపడ్డామన్నది జన సేనాని అభిప్రాయం. చంద్రబాబు అరెస్టయినప్పుడూ, జన సేన కార్యకర్తలే ధైర్యంగా రోడ్ల మీదకు వచ్చారని జన సేనాని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా.

ఇది, టీడీపీ క్యాడర్‌ని ట్రిగ్గర్ చేసేసింది. విపరీతమైన నెగెటివిటీ టీడీపీ క్యాడర్ నుంచి జన సేన మీద వస్తోంది. నిజానికి, ఇదేమీ కొత్త వ్యవహారం కాదు.

ఆర్గనైజ్డ్ నెగెటివిటీ.. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా..

ఆర్గనైజ్డ్‌గా ఈ నెగెటివిటీని కొందరు పవన్ కళ్యాణ్ మీద రుద్దుతుండడం జరుగుతోంది గత కొంతకాలంగా. దీనికి టీడీపీ అధినాయకత్వం కూడా అడ్డుకట్ట వేయలేకపోతోంది.

గతంలో వేరు.. ప్రస్తుతం మారిన పరిస్థితులు వేరు. కూటమిలో ఏ చిన్న ‘గొడవ’ అయినా, అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది.!

‘జనసేనాని వాలకం చూస్తోంటే, టీడీపీకి వ్యతిరేకంగా గొడవకి సిద్ధమవుతున్నట్లే..’ అన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.

ఒకవేళ శతృవుకి శతృవు మితృడు.. అని గనుక, వైసీపీ భావిస్తే, రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్ మారిపోతుందన్నది నిర్వివాదాంశం.

రాజకీయాల్లో ఎప్పుడు ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో ఊహించలేం.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.. వైసీపీ – జన సేన కాంబినేషన్ ఫిక్స్ అయిపోవచ్చు కూడా.!

అక్కడిదాకా పరిస్థితి వెళ్లకుండా, టీడీపీ అధినాయకత్వం, తమ కార్యకర్తల్ని అదుపు చేసుకుంటుందా.? అన్నదే ఇక్కడ ప్రశ్న.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group