Ester Noronha Samskar: రెండు నిమిషాల ట్రైలర్ చూసి, సినిమాలో చూడకూడనిదేదో వుందని ఎలా డిసైడ్ చేసేస్తారంటూ గుస్సా అవుతోంది ఎస్తేర్ నోరోన్హా. ఇంతకీ ఎవరీ ఎస్తేర్.?
నటుడు, ర్యాపర్ నోయెల్ సీన్ (Noel Sean) గుర్తున్నాడా.? అదేనండీ, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఓ సీజన్‌లో కనిపించాడే.. ఆ నోయెల్.! సదరు నోయెల్‌ని ప్రేమించి పెళ్ళాడింది ఈ ఎస్తేర్ నోరోన్హానే.! ఏమయ్యిందోగానీ, పెళ్ళయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్యా మనస్పర్ధలొచ్చి, విడాకులు తీసేసుకున్నారు.
సరే, ఎస్తేర్ వ్యక్తిగత జీవితం గురించిన చర్చ ఎందుకుగానీ.. ఆమె ఓ సినిమాలో నటించింది. దాని పేరు, ‘నెంబర్ 69 సంస్కార్ కాలనీ’. సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడుతోందామె. ఈ విషయంలో ఎస్తేర్‌ని అభినందించి తీరాలి.
Ester Noronha Samskar.. ఈ సినిమా లెక్చర్లేంటి మేడమ్.!
కానీ, సినిమా ప్రమోషన్ పేరుతో లెక్చర్లు దంచెయ్యడమే చాలామందికి నచ్చడంలేదు. అయినా, అందరికీ అందరూ నచ్చాలనే రూల్ ఏమీ లేదు కదా.!
కాకపోతే, ‘మా సినిమాలో చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చిస్తున్నాం. సమాజంలో కొందరు మహిళలు మానసికంగా శారీరకంగా అసంతృప్తితో వున్నారు..’ అంటూ ఏవేవో చెబుతోంది ఎస్తేర్. ఇదెక్కడి వింత పంచాయితీ.?
Also Read: ముసుగు వేయాలా.? వద్దా.? ఏ ప్రయోజనం కోసం ఈ రగడ.!
సినిమాలో ఎస్తేర్ చేసిన గ్లామర్ షో కారణంగా ఆమె మీద ట్రోలింగ్ జరుగుతోంది. దాన్ని ప్రస్తావిస్తూ, ఇంకాస్త బోల్డ్‌గా మాట్లాడేస్తూ, ‘మేల్ ఎస్కార్ట్స్’ అనీ, ఇంకోటనీ.. ఏవేవో చెబుతూ క్లాసులు పీకేస్తోంది.
బోల్డ్ మాటల్తో బోల్తా కొట్టించేసి.!
మహిళ వేషధారణ చూసి, ఆమె క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేసేస్తారని కూడా ప్రశ్నిస్తోంది. వావ్.! ఎట్నుంచి కథ ఎటో వెళ్ళిపోయింది కదా.! సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఇంతలా కష్టపడుతోందా.?
అయినా, నాలుగు బూతులతో యూత్‌ని ఆకట్టుకుని క్యాష్ చేసుకోవాలనుకునే ఇలాంటి సినిమాలకి ఇంత పబ్లిసిటీ ఎస్తేర్ చేయాలనుకోవడంలో అర్థమే లేదు.