‘షేమ్ ఆన్ యూ సమంత..’ అంటూ సోషల్ మీడియా వేదికగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (Family Man 2 Controversy Samantha Akkineni) విడుదలకు ముందు నడిచిన రగడ. అప్పుడేమో, సమంత మీద విపరీతంగా ట్రోలింగ్ చేశారు.. ‘సిగ్గు పడు సమంతా..’ అంటూ నిస్సిగ్గుగా విరుచుకుపడిపోయారు.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదలైంది. విడుదలకు యాగీ చేసినోళ్ళంతా, ఆ తర్వాత సైలెంటయిపోయారు. ఔను, ఇప్పుడు ఎవరో ఒకరు సిగ్గుపడాలి కదా.? సమంత అక్కినేని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘హేటర్స్’ ఆశించిన కంటెంట్ అందులో లేకపోవడంతో, అంతా మిన్నకుండిపోయారు. ‘వావ్ సమంత..’ అంటూ అభినందిస్తున్నారంతా. సో, సమంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత అక్కినేని (Samantha Akkineni) మరింత గర్వంగా తలెత్తుకు తిరగగలదు.
హేటర్స్ పరిస్థితేంటి.? ఇంకేముంటుంది.? సిగ్గూ ఎగ్గూ ఎలాగూ వుండవ్. సో, ఇంకో వివాదం కోసం ఎదురుచూస్తుంటారు. నిజానికి, ఇలాంటి హేటర్స్ మీద చాలా ఆరోపణలు, అనుమానాలున్నాయి. ఆయా సినిమాల విడుదలకు ముందు వీళ్ళకు డబ్బులిచ్చి మరీ, కొందరు ఆయా సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తుంటారన్నది ప్రముఖంగా వినిపించే వాదన. సమంత అక్కినేని (Samantha Ruth Prabhu) విషయంలో (Family Man 2 Controversy Samantha Akkineni) ఏం జరిగింది.?
చాలా సినిమాల విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కొన్నిసార్లు ఆయా చిత్రాల నిర్మాతలే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారన్నది ఓ వాదన కాగా, ఆయా సినిమాలు దెబ్బతినాలన్న దుర్భుద్ధితో ప్రత్యర్థులు కుట్ర పన్నడమూ జరుగుతుంటుందన్నది మరో బలమైన అభిప్రాయం.
సోషల్ మీడియా అంటేనే చెత్త.. అన్న భావన పెరిగిపోవడానికి ఇలాంటి హేటర్స్ కూడా ఓ బలమైన కారణం.