Table of Contents
Create Your Own Fashion.. Write Your Own Story.. Fashion is the freedom to wear what u like.. Enjoy It! ఔను, ఈ రోజుల్లో మన ఫ్యాషన్‌కి మనమే శ్రీకారం చుట్టాలి.
మన ఫ్యాషన్ కథ మనమే రాసుకోవాలి. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి.? ఎలా కనిపించాలి.? అన్న ఫ్రీడమ్ (Fashion Freedom Our Own Styling) ఎవరికి వారు కల్పించుకోవాలి.!
ఇదీ నేటి నయా ట్రెండ్. ఇందులో చాలావరకు వాస్తవం లేకపోలేదు. ఏది అసభ్యం.? ఏది జుగుప్సాకరం.? అన్న అంశాల చుట్టూ అనవసర రాద్ధాంతం తప్ప, అర్థవంతమైన చర్చ ఎవరికీ అనవసరం.
ఏ ఫ్యాషన్ అయినా, హద్దులు దాటిదే జుగుప్సాకరమే. అదే సమయంలో, అందంగా కనిపించాలనుకున్నప్పుడు, అందుకోసం ట్రెండీగా మారడాన్ని తప్పు పట్టలేం.
Fashion Freedom Our Own Styling.. ఎవరిష్టం వాళ్ళది..
ముందే చెప్పుకున్నాం కదా.. ఎవరి ఇష్టం వాళ్ళది. ‘నీ గురించి మాత్రమే చర్చించుకునేంత తీరిక జనానికి లేదు’ అని ఓ మహానుభావుడు చెబుతాడు.
అదీ నిజమే. చూస్తాం, నచ్చితే బావుంటుందనుకుంటాం.. లేదంటే లైట్ తీసుకుంటాం. మరీ ఖాళీగా వుంటే, నాలుగు కామెంట్లు పడేస్తాం.

అవి మంచి కామెంట్లు అయినా, చెత్త కామెంట్లు అయినా.. ఇదీ నేటి నెటిజన్ల ట్రెండ్. కాబట్టి సోషల్ మీడియా ట్రోలింగ్‌ని కూడా పట్టించుకోవాల్సిన (Fashion Freedom Our Own Styling) పనిలేదు.
కరోనా పాండమిక్.. జనానికి చాలా ఫ్యాషన్ పాఠాలు నేర్పింది. ఔను, చాలామంది ఫ్యాషన్ ట్రెండ్స్‌కి సంబంధించి చాలా చాలా నేర్చుకున్నారు.
ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్స్..
తమకు తామే ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్స్ అనే బిరుదులు తగిలించేసుకున్నారు. హెయిర్ కలర్ దగ్గర్నుంచి, కాలి గోటి మీద డిజైన్ల దాకా.. ఇప్పుడంతా సెల్ఫ్ మేడ్ ఫ్యాషన్.
డిజైనర్ దుస్తులు ఇంట్లోనే తయారైపోతున్నాయ్. వారెవ్వా.. ఎంత మార్పు.? అని ఆశ్చర్యపోనక్కర్లేదు (Fashion Freedom Our Own Styling).
చిరిగిన జీన్సు, నలిగిన షర్టు.. అన్నీ ఫ్యాషనే. అమ్మాయిలతో పోల్చితే, అబ్బాయిలకు అవకాశాలు చాలా చాలా తక్కువే.
అందమంటేనే అమ్మాయి.!
ఎంతైనా అందం అంటే, ముందుగా అమ్మాయిలే గుర్తుకొస్తారు కదా.. వాళ్ళకే మరి, ఫ్యాషన్ ఎక్కువ అవసరం.
తమను తాము అందంగా మలచుకోవడం ద్వారా ఇతరులనీ అందంగా మలచడం నేర్చుకోగలుగుతారు.
అలా ఎవరికి వారు ఫ్యాషన్ ట్రెండ్స్‌లో ఇంటి దగ్గరే మాస్టర్ డిగ్రీలు సంపాదించేసి.. సొంతంగా, డిజైనర్ స్టూడియోలు, బ్యూటీ పార్లర్లు నడిపేందుకు ముందుకొస్తున్నారు.
ఫ్యాషన్ అంటే వెస్టర్న్ ట్రెండ్ మాత్రమే కాదు.. ఇది మనింట్లోని నయా ట్రెండ్.!
