జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది చాలామంది డ్రీమ్. కొందరు ఆ విమానాలకి పైలట్ అవుదామనుకుంటారు. దేశ రక్షణ కోసం జెట్ ఫైటర్ (Fighter Jet Pilot Training) నడపాలనే ‘కసి’ మీలో వుందా.? అసలు ఫైటర్ జెట్ నడపాలంటే, దానికోసం ఎంత ఖర్చవుతుంది.? తెలుసుకుందాం పదండి.!
ఫైటర్ జెట్ పైలట్ అవడమంటే.. గాల్లో విమానం నడపడమే కాదు, దేశం కోసం ప్రాణాలివ్వడం కూడా. నిజానికి, దేశం కోసం ప్రాణాలివ్వడం.. అనే ఆలోచనతోపాటు, దేశాన్ని గెలిపించాలనే కసి కూడా వుండాలి. ప్రపంచ వ్యాప్తంగా వైమానిక దళం ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.
ప్రత్యర్థుల మీద పై చేయి సాధించగలిగే ఏ అవకాశాన్నయినాసరే ఏ దేశమూ వదులుకోదు. అందుకే, అత్యాధునిక యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఎంత అత్యాధునిక విమానమైనాసరే, దాన్ని నడపాల్సింది మనిషే కదా.! ఆ పైలట్ అత్యంత సమర్థుడై వుండాలి. మెరుపులా ఆ పైలట్ ఆలోచనలుండాలి.
ఓ అంచనా ప్రకారం అత్యాధునిక యుద్ధ విమాన పైలట్ శిక్షణ కోసం (Fighter Jet Pilot Training) భారతదేశంలో ఏకంగా 13 కోట్ల రూపాయల ఖర్చవుతుందట. అయితే, ఇది 2015 నాటి లెక్కల సారాంశం. ఇప్పుడు అది రెండింతలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పైలట్‌గా శిక్షణ పొందడం అత్యంత కఠినతరమైనది.
మూడు దశల్లో సుమారు 285 గంటల పాటు ఈ శిక్షణ తీసుకోవాల్సి వుంటుంది. 99.99 శాతం కాదు, 100 శాతం ఖచ్చితత్వంతో కూడిన ప్రదర్శన అవసరం అని చెబుతుంటారు ఈ విభాగంలో ముందుకు వెళ్ళాలంటే.
యుద్ధ విమానాలకు సంబంధించి ప్రమాదాల గురించి తరచూ వింటుంటాం. చివరి నిమిషం వరకూ విమానాన్ని సేఫ్ ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నిస్తుంటాడు. అతి అతని బాధ్యత. అదే సమయంలో, విధిలేని పరిస్థితుల్లో తనను తాను కాపాడుకోవడంపైనా పైలట్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటాడు.
నిర్ణయం తీసుకోవడంలో ఖచ్చితత్వం, వేగం అత్యంత ముఖ్యమైనవి యుద్ధ విమానం కూలిపోతున్న సమయంలో. క్షణాల్లో నిర్ణయం తీసేసుకుని, పైలట్ తనను తాను కాపాడుకోవాల్సి వుంటుంది.
పైలట్ (Fighter Jet Pilot Training) వేసుకునే సూట్‌లో కొన్ని రోజులకు సరిపడా శక్తివంతమైన ఆహారం కూడా వుంటుంది. ఓ లొకేటర్ కూడా ఆ సూట్‌లోనే పొందుపర్చుతారు.
పైలట్ అంటే ఆషామాషీ కాదు. పైలట్ శిక్షణ కోసం కోట్లు ఖర్చు చేసేది అందుకే. పైలట్ నడిపేది అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. పైలట్ అనుభవం అన్నటికంటే విలువైనది. అందుకే జయహో పైలట్ అనేది.!