Table of Contents
Flora Saini Emotional Note..‘లక్స్‌పాప’గా టాలీవుడ్‌కి సుపరిచితురాలు ముద్దుగుమ్మ ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ. గతంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
హీరోయిన్‌గా రాణించలేక చిన్న చిన్నక్యారెక్టర్స్‌లోనూ తళుక్కున మెరిసింది. అడపా దడపా కొన్ని ఐటెం సాంగ్స్‌లోనూ కనిపించింది.
బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి, అప్పటి నుంచీ లక్స్ పాపగా టాలీవుడ్ జనానికి గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఆశా షైనీకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.
Flora Saini Emotional Note.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే..
కానీ, పలు వెబ్ సిరీస్‌లతో ఓటీటీలో చాలా బిజీగా గడుపుతోంది ప్రస్తుతం. ఓటీటీలో ఆశా షైనీ బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది ఆషా ఫైనీ.
నటులుగా తామేం చేసినా ఏ ఏ పాత్రల్లో కనిపించినా అదంతా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే.. అంటూ ప్రేక్షకుల్ని వుద్దేశించి ఓ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆశా షైనీ.
ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఈ మధ్య అర్ధాంతరంగా తనువు చాలించిన పలువురు సినీ ప్రముఖుల జీవితాలకి సంబంధించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన నిజాల్ని నేనిప్పుడు బయటపెడుతున్నా.. అని రాసుకొచ్చింది.
ఇటీవల చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అకాల మృత్యువాత పడ్డారు. ఆ మరణాలకు సంబంధించి తెర వెనక చాలా చాలా సీక్రెట్స్ వుంటాయ్.
రీల్ లైఫ్ ఎఫెక్ట్, రియల్ లైఫ్ పైనా..
బోలెడంత కష్టం దాగి వుంటుంది. తట్టుకోలేనంత ఒత్తిడి వుంటుంది. చాలా ఎక్కువ సమయం మేం షూటింగుల పేరు చెప్పి వర్క్ చేయాల్సి వుంటుంది..
ఏం చేసినా, ఎంత చేసినా అదంతా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే.!

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది. మేము కేవలం నటులం మాత్రమే. ఆయా ప్రాతలు పోషిస్తుంటాం. అయినా కానీ, మేమూ మనుషులమే కదా.!
నటనలో భాగంగా చాలా చాలా పాత్రలు పోషిస్తుంటాం. ఆయా పాత్రల ప్రభావం మా జీవితాలపైనా ఎంతో కొంత వుంటుంది. అదే మా జీవితాల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంటుంది.
ఏం చేసినా అదంతా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం కోసమే. తెరపై మమ్మల్ని చూసి తిరిగా మీరు మాపై చూపించే మెచ్చుకోలే ఎప్పటికప్పుడు మాలో జోష్ నింపుతుంటుంది. కొత్త జీవితాన్నిస్తుంది.
వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ..
అర్ధాంతరంగా ముగిసిపోయిన కొన్ని జీవితాలకి మనస్పూర్తిగా కృతజ్థతలు తెలుపుతూ, వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..
మమ్మల్ని ఎంతగానో అబిమానించే మీరు కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధించండి.. అంటూ ఆశా షైనీ రాసుకొచ్చింది.
Also Read: Neha Aisha Sharma Sisters.. అక్కాచెల్లెళ్ళ అందాల దాడి.!
నిజంగానే తెరపై ముఖానికి రంగులేసుకుని కనిపించే నటుల జీవితం వెనక ఎన్నో తెలియని బాధలుంటాయ్. పైకి చిరునవ్వులు చిందిస్తూ కనిపించే వారి జీవితాల్లో తీర్చలేని కన్నీటి గాధలుంటాయ్.
వాటన్నింటినీ ఇదిగో ఈ నోట్‌లో కాస్త ఎమోషనల్‌గానే వివరించి చెప్పింది ఆశా షైనీ. ఆశా షైనీని దాదాపుగా తెలుగు జనం మర్చిపోయారు.
ఈ తాజా పోస్ట్‌తో సోషల్ మీడియాలో ఆమె పేరు మళ్లీ స్పురణకొచ్చినట్లయ్యింది.