Free Cinema Ticket.. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే, సినీ జనాలు బోల్డన్ని జిమ్మిక్కులు చేయాలి.! ప్రేక్షక దేవుళ్ళంటూనే, ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టాలి.! అదే సినీ మాయ అంటే.!
సినిమాలో కంటెంట్ వుంటే, ప్రేక్షకులు సినిమాని థియేటర్లలో చూడటానికి ఇష్టపడతారు. కంటెంట్ లేకపోతే, అంతే సంగతులు.!
ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేసినా, సినిమా ఆడాలంటే.. కంటెంట్ వుండి తీరాల్సిందే.
అసలు విషయానికొస్తే, ఓ సినిమా సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌తో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అదే, ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్.!
Free Cinema Ticket.. ఒకటి కొంటే, ఇంకొకటి ఉచితం..
అంటే, ఓ టిక్కెట్ కొంటే.. ఇంకో టిక్కెట్టు ఫ్రీ.. అన్నమాట.! బట్టల దుకాణాల్లో చూస్తుంటాం, ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్లు.! ఇప్పుడది సినిమా టిక్కెట్లకీ అమలు చేస్తున్నారన్నమాట.
‘మేరీ హజ్జెండ్ కీ బీవీ’ అనే పేరుతో తెరకెక్కిన సినిమా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ ఇది. రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.

టైటిల్ చూస్తే, విషయం అర్థమయిపోతోంది కదా.! ఓ భర్త, ఇద్దరు భార్యలన్నమాట.! బోల్డన్ని సినిమాలు ఈ తరహా కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చాయ్.
నిజానికి, ఇదో సక్సెస్ ఫార్మాట్.! ఈ ఫార్మాట్‌లో వచ్చిన చాలా సినిమాలు హిట్టయ్యాయి. రొమాంటిక్ కామెడీ ఈ సినిమాల్లో ఎక్కువగా వుంటుంది. ఈ ‘మేరీ హజ్బెండ్ కీ బీవీ’ కూడా అంతే.
ప్రేక్షకుడికి ఊరట.. నిర్మాతకో.?
మల్టీప్లెక్సుల రాకతో, సినిమా థియేటర్ల వ్యవహారమే మారిపోయింది.! ఓటీటీ పుణ్యమా అని, థియేటర్ల వైపు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటంలేదాయె.!
ఈ పరిస్థితుల్లో ‘వన్ ప్లస్ వన్’ కొంత మేర.. ప్రేక్షకుడిని థియేటర్ వైపు చూసేలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.!
Also Read: బాలయ్యతో సంయుక్త.! ‘అఖండ-2’లో ఆమె పాత్ర ఏంటి.?
ఇప్పటికైతే ‘వన్ ప్లస్ వన్’.. ముందు ముందు ‘వన్ ప్లస్ టూ’, ‘వన్ ప్లస్ త్రీ’ ఆఫర్లతో సినిమాలు ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ త్రీ.. అంటే, ఫ్యామిలీ ప్యాక్ వ్యవహారమే మరి.! వీకెండ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న దరిమిలా, వీక్ డేస్‌లో ఈ ‘వన్ ప్లస్ వన్’ తరహా ఆఫర్లు అందరికీ లాభయదాయంగానే వుంటాయేమో.!