ఖాన్ కాదు, శర్మ.! ఏంటి పాపా నీ గోల.!
Actress Deviyani Sharma Khan.. ఈ బ్యూటీ పేరు దేవియాని శర్మ.! మొన్నామధ్య ‘సైతాన్’ పేరుతో వచ్చిన ఓ వెబ్ సిరీస్‌లో చాలా ఘాటుగా నటించింది.
సోషల్ మీడియాలో అయితే హాట్ అండ్ వైల్డ్ ఫొటోలతో హల్‌చల్ చేస్తుంటుంది. ఒకటీ అరా సినిమాల్లో కూడా నటించింది లెండి.!
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు.. అనే మాట తరచూ వింటుంటాం సినీ ప్రపంచంలో. గ్లామర్ విషయమైనా అంతే.!
అందం.. అవకాశం.. రెండూ కలిస్తే, అద్భుతం.! కలిసి రాకపోతే, అంతే సంగతులు.! ఎందరో అందాల భామలు.. ఇలా వచ్చి, అలా మాయమైపోయారు.
Actress Deviyani Sharma Khan.. హిట్టిచ్చినాగానీ..
సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్లు కూడా, అవకాశాల్లేక ఐటమ్ సాంగ్స్‌కి పరిమితమై, చివరికి సినీ పరిశ్రమకు దూరమైన సందర్భాలున్నాయ్.
గ్లామర్ ప్రపంచం.. సినీ పరిశ్రమ అంటేనే అంత.! హిట్టు, ఫట్టు.. మధ్య కెరీర్ ఊగిసలాడుతుంటుంది. సినీ రంగంలో స్టార్లుగా వెలిగినవాళ్ళూ, తమ వారసులకు హిట్లు ఇవ్వలేని పరిస్థితుల్ని చూస్తున్నాం.
అసలు విషయమేంటంటే, దేవియాని శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తర పేరు చివర్న ‘ఖాన్’ అనే ట్యాగ్ లాంటిది ఏదీ లేదని చెప్పుకొచ్చింది.
‘ఖాన్’ లేకపోతేనేం, శర్మ.. అని వుంది కదా.! అయినా, ఈ ట్యాగ్‌తో కెరీర్‌లో నిలదొక్కుకోవచ్చనుకోవడం మూర్ఖత్వం. అసలు ఆ ప్రస్తావన దేవియాని ఎందుకు చేసిందో ఏమో.!
పబ్లిసిటీ స్టంట్ కాదు కదా..
పేరు ముందర ఎలాంటి ‘హైలీ రెస్పెక్టెడ్ సర్ నేమ్స్’ లేవు గనుక, కష్టపడి మాత్రమే కెరీర్‌లో ముందడుగు వేయాలన్నది బహుశా దేవియాని శర్మ ఉద్దేశ్యం కావొచ్చు.
ఉద్దేశ్యం ఏదైనా, విషయం వేరేలా కన్వే అవుతోంది. ఇది ట్రోలింగ్ యుగం కదా.! సోషల్ మీడియా పైత్యపు కాలం కదా.!
Also Read: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.! ఖాయమైనట్టేనా.?
మాట చాలా పొదుపుగా, జాగ్రత్తగా వాడాలి సుమీ.! ఏమో, కాస్త ట్రిక్కీ ఆన్సర్ ఇస్తే, అదే వైరల్ అయ్యి, ట్రోలింగ్‌కి గురై.. ఫేమ్ పెరుగుతుందని కూడా దేవియాని శర్మ ఆశించిందేమో.!