Geetu Mohandas Toxic Yash.. వల్గారిటీ.. జుగుప్సాకరం.. అత్యంత అసహ్యకరం.. ఏదైనా సరే, అదే అర్థం.! యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా గురించి జరుగుతున్న ప్రచారమైతే ఇదే.
ఇటీవల విడుదలైన గ్లింప్స్ కారణంగానే, ‘టాక్సిక్’ సినిమా మీద, ఇంతటి వల్గర్ అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
నయనతార, కియారా అద్వానీ.. ఇలా పలువురు అందాల భామల లుక్స్ ఒకటొకటిగా బయటకు వచ్చాయి ‘టాక్సిక్’ సినిమా నుంచి. దేనికదే భిన్నంగా.. భలే డిజైన్ చేశారు.
ఇక, యష్ లుక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మాస్ గెటప్.. పైగా, అల్ట్రా స్టైలిష్ లుక్.. వెరసి, యష్ లుక్ అదిరిపోయిందంతే.!
అన్నీ బాగానే వున్నా, గ్లింప్స్ దగ్గరకి వచ్చేసరికి.. అత్యంత జుగుప్సాకరంగా డిజైన్ చేశారు. కారులో, హీరో ఓ అమ్మాయితో ‘ప్లే’ చేస్తాడు.. అది నిజంగానే జుగుప్సాకరంగా డిజైన్ చేయబడింది.
తెలుసు కదా, ‘టాక్సిక్’ డైరెక్టర్ మహిళ అనీ.! అందుకే, ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడింది.
మహిళవి అయి వుండీ, ఇంతటి జుగుప్సాకరమైన రీతిలో సినిమాని ఎలా తెరకెక్కించావ్.? అంటూ, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ మీద నెటిజనం విరుచుకుపడుతున్నారు.
ఇక, ‘టాక్సిక్’పై నడుస్తున్న ట్రోలింగ్ విషయమై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించింది. కథ ప్రకారం, సినిమాలో నటీనటుల పాత్రల్ని డిజైన్ చేసినట్లు చెప్పిందామె.
ఆ పాత్ర ఎందుకలా బిహేవ్ చేస్తుందో, సినిమా చూస్తే అర్థమవుతుంది.. సన్నివేశం ఎందుకు అలా డిజైన్ చేయబడిందో, సినిమా చూస్తే తెలుస్తుంది.. అని గీతూ మోహన్ దాస్ చెప్పుకొచ్చింది.
ఈ తరహా నెగెటివిటీ వింతేమీ కాదనీ, సినిమా విడుదలయ్యాక.. అందరికీ అన్ని విషయాలపైనా స్పష్టత వస్తుందని, కేవలం తాను మహిళని అవడం వల్ల.. తనను టార్గెట్ చేయడం సబబు కాదని ఆమె అభిప్రాయపడింది.
ఓ మగాడు సినిమాని తెరకెక్కించినా, ఓ ఆడది సినిమాని తెరకెక్కించినా.. పెద్దగా తేడా వుండదనీ, క్రియేటివిటీకి ఆడ, మగ.. అన్న తేడాలెందుకు వస్తాయని గీతూ మోహన్‌దాస్ ప్రశ్నిస్తోంది.
వివాదాల్ని పక్కన పెట్టి, హ్యాపీగా సిల్వర్ స్క్రీన్ వండర్ ‘టాక్సిక్’ని ఎంజాయ్ చేయమంటోంది గీతూ మోహన్ దాస్.!
అయినా, ఇటీవలి కాలంలో వల్గారిటీ, హింస లేని సినిమాలు ఎన్ని వస్తున్నాయ్.? అదీ, అగ్ర హీరోల నుంచి.?
ఆ లెక్కన, గీతూ మోహన్ దాస్ విషయంలో జరుగుతున్న వివాదం పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సింది కాదేమో.!
