Global Star RamCharan Oscars మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు.! అదీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం.!
ఆస్కార్ పురస్కారాలు, అంతకన్నా ముందు ‘హెచ్‌సిఎ’ పురస్కారాల నేపథ్యంలో, రామ్ చరణ్ అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, రాజమౌళి అమెరికా పర్యటనకు విపరీతమైన క్రేజ్ చూశాం. సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ హోరెత్తిపోయింది. మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా అంతా, రాజమౌళి అమెరికా పర్యటనల గురించి గొప్పగా మాట్లాడింది.
రామ్ చరణ్ అలాగే ఎన్టీయార్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడూ ఈ హంగామా చూశాం.
రామ్ చరణ్ అమెరికా టూర్ పట్ల తెలుగు మీడియాలో స్తబ్దత ఎందుకు.?
టాలీవుడ్ స్టార్ హీరోకి అమెరికా గడ్డపై దక్కుతున్న గౌరవాన్ని ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నాం.?
ఇండియన్ సినిమా గురించి విదేశీ వేదికలపై గొప్పగా మాట్లాడుతున్న రామ్ చరణ్‌ని తెలుగు మీడియా పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి.?
Mudra369
కానీ, రామ్ చరణ్ ఒంటరిగా అమెరికా వెళితే మాత్రం, ఆ హంగామా మన తెలుగు మీడియాలో, ఇండియన్ మీడియాలో అంతగా కనిపించడంలేదు.
Global Star RamCharan Oscars.. ఎక్కడ తేడా జరిగిందబ్బా.?
అమెరికన్ మీడియా రామ్ చరణ్ వెంట పడుతోంది. పలు షోలలో రామ్ చరణ్ చేస్తోన్న సందడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు మెగా పవర్ స్టార్.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ వస్తే, అది దేశానికి అంకితం చేస్తామని కూడా చెబుతున్నాడు రామ్ చరణ్.
‘నాటు నాట’ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడాన్ని ఎంజాయ్ చేస్తున్నాననీ, అది దేశానికి దక్కిన అరుదైన గౌరవమనీ రామ్ చరణ్ చెబుతున్న సంగతి తెలిసిందే.
Also Read: మేనమామతో మేనల్లుడి ‘సిత్రం’.! టైటిల్ ఏంటబ్బా.?
ఎన్టీయార్‌తో స్నేహం గురించీ, తన వ్యక్తిగత విషయాల గురించీ, ఇండియన్ సినిమా అలాగే తెలుగు సినిమా గురించీ రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అమెరికన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.
అయినాగానీ, రామ్ చరణ్ అమెరికా పర్యటనకు దక్కాల్సిన స్థాయిలో తెలుగు మీడియా ‘కవరేజీ’ దక్కడంలేదు. వెబ్ మీడియా కూడా చూసీ చూడనట్టు ఊరుకుంటోంది. ఇది కాస్తా రామ్ చరణ్ అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఇది పెద్ద అవమానం.. అని కొందరు అంటోంటే, చరణ్ ఘనతను ఒప్పుకోలేనివారు, తమని తాము అవమానించుకుంటున్నారన్నది ఇంకొందరి వాదన.! ఏది నిజం.?