God Father Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయి కూర్చుంది. సినిమా దారుణమైన నష్టాల్ని చవిచూసిందంటూ ట్రేడ్ పండితులు చెబుతున్న సంగతి తెలిసిందే.
కనీ వినీ ఎరుగని స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయనే ప్రచారం జరుగుతున్న వేళ, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకుని, ‘సాయం’ చేస్తారని అంతా అనుకున్నారు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి మాత్రం విదేశాలకు చెక్కేశారు. సతీమణి సురేఖతో కలిసి విదేశాలకు వెళుతున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కోవిడ్ పాండమిక్ తర్వాత చిరంజీవి కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళడం ఇదే తొలిసారి. ‘మళ్ళీ త్వరలోనే వచ్చేస్తా..’ అని కూడా పేర్కొన్నారు చిరంజీవి, సోషల్ మీడియాలో.
God Father Chiranjeevi ఏం చేస్తాడో.!
ఇదిలా వుంటే, చిరంజీవి తదుపరి సినిమా ‘గాడ్ ఫాదర్’ కోసం అదనపు గ్లామర అద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కి ఇది తెలుగు రీమేక్.

చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకి డాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు ఈ సినిమాతో ప్రభుదేవా. ‘లూసిఫర్’ సినిమాలో పాటలకు స్కోప్ లేకపోయినా, తెలుగు వెర్షన్ కోసం అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పిస్తున్నారు.
నయనతార ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఓదార్పు.. ఇప్పటికే జరిగిపోయిందా.?
ఇంతకీ, విదేశాల నుంచి తిరిగొచ్చాక అయినా, ‘ఆచార్య’ బాధితుల్ని చిరంజీవి ఓదార్చుతారా.? ఆదుకుంటారా.? అంటే, ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చిరంజీవి బాధ్యతగానే వ్యవహరిస్తారు.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
పైగా, ఇప్పుడు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకే పెద్ద దిక్కు. సో, ఇప్పటికే ఆయన డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇచ్చి వుంటారు. లేకపోతే, ‘మేం నష్టపోయాం మహాప్రభో..’ అంటూ ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కేయకుండా వుంటారా.?