Godfather Chiranjeevi.. టైము, టైమింగు.! ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఎవరూ సాటి రారు.! వ్యవస్థలో మార్పు కోసం మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
అప్పుడూ ప్రజల్లో మార్పు రావాలనే చిరంజీవి కోరుకున్నారు.. ఇప్పుడూ అదే మార్పు కోసం జనసేన పార్టీతో పోరాడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ.. ఈ రెండు పార్టీల లక్ష్యం ఒకటే. నిజాయితీ, నిబద్ధత. రాజకీయాల్లో నిజాయితీ వుండాలి.. నిబద్ధతతో కూడిన రాజకీయాలు నడవాలి.
ఏవడో గొట్టంగాడికి కామెడీగా అనిపించిందట.!
ఇది వ్యవస్థలో మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నం. అధికారంలో వున్న పార్టీ నుంచి ప్రకటనలు వస్తోంటే, పూట గడుపుకుంటున్నట్లుండదు వ్యవహారం.
ప్రజా సమూహం ముందుకు కదలాలి.. అదీ అభివృద్ధి వైపు. వారిని నడిపించగల శక్తికి మద్దతివ్వాలి మీడియా అంటే. నాన్సెన్స్, ఈ రోజుల్లో మీడియా అంటే, ఎంగిలి మెతుకులు ఏరుకునే స్థాయికి దిగజారిపోయింది.
మీడియాలో అందరూ అలాగే వున్నారా.? లేరు, కానీ.. చాలా ఎక్కువమంది అలాగే వున్నారు. అదే అసలు సమస్య.
దోచుకున్నోడు, జైలుకెళ్ళినోడు గద్దెనెక్కుతున్న రోజులివి. వారికి బాకా ఊదడమే కాదు, వాళ్ళు విసిరే ఎంగిలిమెతుకులతో సోకాల్డ్ మీడియా సంస్థలు నడుస్తున్నాయ్.
Godfather Chiranjeevi.. నిబద్ధత, నిజాయితీ.. వాళ్ళకెలా కనిపిస్తుంది.?
సినిమాల్లో కష్టపడి సంపాదించిన సంపాదనని రాజకీయాల్లో పెట్టారు అప్పట్లో చిరంజీవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. ఇదీ నిబద్ధత అంటే.
కానీ, సోకాల్డ్ గొట్టంగాళ్ళకి నిబద్ధత అలాగే నిజాయితీ అంటే వేరేలా కనిపిస్తోంది. ప్రజల్ని దోచెయ్యడం నిబద్ధత.. హత్యలు, అత్యాచారాలు చేసి నిస్సిగ్గుగా, నగ్నంగా బరితెగిస్తే అది ఆ గొట్టంగాళ్ళకి తెలిసిన నిజాయితీ. కుల పిచ్చి, మత పిచ్చితో రగిలిపోవడమే వాళ్ళు భావించే నిబద్ధత, నిజాయితీ.!
Also Read: Nandamuri Balakrishna.. ‘చరిత్ర’ మర్చిపోతే ఎలాగయ్యా.?
రాజకీయాల్లోకి వెళ్ళక ముందు ఆస్తులు, వెళ్ళాక ఆస్తుల లెక్కలు తీస్తే, ఎవడి సంగతేంటో తేలిపోతుంది. ప్చ్.. ఇక్కడ మీడియాని అనడం దండగ. మారాల్సింది ప్రజలు.
ఆ మార్పు కోసం ప్రయత్నం జరుగుతోంటే, ఈ ఎంగిలి కూడుకి ఆశపడే మీడియా, దానికి అడ్డు పడుతోంది. అలా అడ్డుపడే కక్కుర్తి మీడియా దృష్టిలో నిజాయితీ, నిబద్ధత అంటే కామెడీగానే వుంటుంది మరి.!
‘నా తమ్ముడికి నిబద్ధత, నిజాయితీ వున్నాయ్..’ అని చిరంజీవి చెప్పడం ద్వారా, సోకాల్డ్ రాజకీయ నాయకులు, పార్టీలు.. అలాగే ఆ మోచేతి నీళ్ళను తాగే భజన మీడియాకి ఎక్కడో కాలింది.! వాళ్ళ అహాన్ని ‘గాడ్ ఫాదర్’ పాతరేసినట్లయ్యింది.!