Table of Contents
GST Reforms 2025.. హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద పన్ను.. పాప్ కార్న్ మీద పన్ను.. కాదేదీ, పన్నుల మోతకి అనర్హం.!
అంతకు ముందూ పన్నులున్నాయ్.. కానీ, జీఎస్టీ తర్వాత పన్నుల భారం మీద ఎక్కువ.. చాలా చాలా ఎక్కువ చర్చ జరిగింది.
జీఎస్టీ స్లాబుల విషయంలో చర్చ కంటే ఎక్కువ రచ్చే జరిగింది. ఇంతకీ, పెట్రో ధరల్ని ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంలేదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
GST Reforms 2025.. శ్లాబులు తగ్గాయి.. మారాయి..
5 శాతం, 12 శాతం, 18 శాతం… ఇలా పలు శ్లాబులు నిన్న మొన్నటిదాకా వుండేవి. కానీ, ఇప్పుడు వాటిల్లో కొన్ని మార్చారు.. కొన్నిటిని తీసేశారు. 12 శాతం లేపేసి, 18 శాతం మాత్రమే వుంచారు.
12 శాతంలోవి 5 శాతంలోకి వచ్చాయి. కొన్నిటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. కొన్నిటిని 40 శాతంలోకి పంపారు. అంతిమంగా, సామాన్యుడికి ఊరట.. అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

లగ్జరీ కార్లపై పన్నులు సబబే. ఎంత ఎక్కువ పన్నులు లగ్జరీ కార్ల మీద వేసినా, తక్కువే. అలానే, లిక్కర్ మీదా ట్యాక్సులు ఎడా పెడా వేసేసుకోవచ్చు.
సిగరెట్స్ మీద జీఎస్టీ 40 కాదు, 400 శాతం వేసినా.. దాన్నెవరూ తప్పు పట్టే పరిస్థితి వుండదు. ఎందుకంటే, ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తుందది.
జీఎస్టీ తగ్గినా.. సామాన్యులకు మేలు జరిగేనా.?
లగ్జరీ కార్లు కాకుండా, మామూలు కార్లకు సంబంధించి జీఎస్టీ తగ్గింది సరే. కానీ, ఆ తగ్గింపు తాలూకు ఉపశమనం, కార్ల కంపెనీల నుంచి సామాన్యులకు కలుగుతుందా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
కార్లు మాత్రమే కాదు, వివిధ రకాలైన ఆహార పదార్థాలు, వస్తువులు.. వీటిపైన జీఎస్టీ తగ్గినా, వ్యాపారులు.. సామాన్యలకు పట్ల కనికరంతో వ్యవహరించే పరిస్థితి వుంటుందో లేదో తెలియదు.
ప్రభుత్వం నడవాలంటే, ప్రజల మీద పన్నుల భారం మోపాల్సిందే. ఖజానా నిండేది ప్రజలు కట్టే పన్నులతోనే. సంక్షేమ భారం మోయాల్సింది కూాడా ప్రజలే. ఓ వైపు నుంచి తగ్గించారంటే, ఇంకో వైపు నుంచి భారం మోపాల్సిందే. ఆ భారాన్ని ప్రజలు భరించాల్సిందే.
ఉదాహరణకి హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద జీఎస్టీ తగ్గింపు మంచిదే. కానీ, ఇన్స్యూరెన్స్ ప్రీమియంని కంపెనీలు పెంచేస్తేనో.?
నేరుగా వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా, జీఎస్టీ శ్లాబులు తగ్గించారా.? అన్నదానిపై కొంత గందరగోళమైతే వుంది.
అన్ని విషయాల మీదా స్పష్టత రావాలంటే, ఇంకొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ నెలాఖరులోగా లెక్కలు తేలిపోతాయి.
పెట్రో ఉత్పత్తులు ఏం పాపం చేశాయి.?
పెట్రోల్, డీజిల్ ధరలంటే.. అవేవో, కేవలం వాహనాలకు సంబంధించిన వ్యవహారమని అనుకుంటారు చాలామంది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా వస్తువుల రేట్లను ఈ పెట్రో ధరలు నిర్ణయిస్తుంటాయి. కూరగాయలు, పండ్లు.. ఇలా అన్నిటి ధరలూ.. రవాణా ఖర్చుల కోణంలోనూ డిసైడ్ అవుతాయ్ మరి.
రావాణా ఖర్చు పెరిగితే, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. రవాణా ఖర్చులు పెరిగేది పెట్రోల్, డీజిల్ ధరల కారణంగానే.
మరి, అలాంటప్పుడు, పెట్రోల్ అలాగే డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి కదా.? అప్పుడే కదా, ధరలు తగ్గి, ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలుగుతుంది.
ప్చ్.. ఆ ఒక్కటీ జరగదంతే.! అది జరిగితే, దేశ ప్రజలు బాగుపడిపోతారు మరి. అలా బాగుపడటం, పాలకులకు అస్సలేమాత్రం ఇష్టం వుండదు.