చూస్తున్నారుగా ఈ ఫోటోలో వున్న ముద్దుగుమ్మ ఓ హీరోయిన్. టాలీవుడ్లో ఓ యంగ్ హీరో సినిమాతో పరిచయమైంది.
ఆ తర్వాత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌లో నటించింది. మాస్త్ గ్లామర్ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేవ్ పాపం ఈ బ్యూటీకి.
ఈ ఫోటో చూస్తుంటేనే అర్ధమవుతుంది అమ్మడి గ్లామర్ లిమిట్స్ ఏ పాటివో. కాగా తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సరసన బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించింది.
బాలయ్యతో మూడు సినిమాలు..
అయితే హీరోయిన్గా కాదులెండి. ఐటెం గాళ్‌గా. బాలయ్యతో మాస్ స్టెప్పులు ఇరగదీసేసిన ఈ ముద్దుగుమ్మ కింగ్ నాగార్జున సరసన హీరోయిన్గా ఓ సినిమాలో నటించిందండోయ్.

పక్కా యాక్షన్ గాళ్‌గా. హీరోకి ఎంత మాత్రమూ తీసిపోని యాక్షన్‌తో అదరగొట్టేసిందీ అమ్మడు. అయితే, ఆ సినిమా ఆశించిన రేంజ్లో పాపకి సక్సెస్ ఇవ్వలేదు.
కింగ్ నాగ్ సరసన యాక్షన్ గాళ్‌గా..
ఇంతకీ ఎవరో కనిపెట్టారా ఈ అందాల బొమ్మ.? సర్లెండి.. సీక్రెట్ రివీల్ చేసేద్దాంలే. పేరు సోనాల్ చౌహాన్. ‘రెయిన్ బో’, ‘పండగ చేస్కో’ తదితర సినిమాల్లో నటించింది.

బాలయ్యతో ఏకంగా మూడు సినిమాల (రూలర్, లెజెండ్, డిక్టేటర్)లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘సైజ్ జీరో’, ‘షేర్’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటించింది.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ షార్ట్ రోల్ పోషిస్తోంది. కాలం కలిసి రావడం లేదు కానీ, కలిసొస్తే స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ పక్కా హీరోయిన్ మెటీరియల్ సోనాల్ చౌహాన్.